హైదరాబాద్:జనవరి 31
ఈ ఉస్మానియా ఆసుపత్రికి జబ్బు చేసి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు. రోగులకు సరిపడా బెడ్స్, ఆపరేషన్ థియేటర్స్ లేమితో పాటు ఎప్పుడూ ఏదో సమస్యతో ఆసుపత్రి కునారిల్లుతున్నా పాలకులకు పెద్దగా పట్టింది లేదు…
దానికి తోడు దాదాపు దశాబ్దాల కిందటి పాత భవనం తరచూ పెచ్చులూ డటంతో దాన్ని మూసి వేయాల్సి వచ్చింది.ప్రస్తు తం ఆసుపత్రి ఉన్న భవనంలో బెడ్స్ లేక ఇబ్బంది పడాల్సిన దుస్థితి. బీఆర్‌ఎస్ సర్కారు కొత్త భవనం నిర్మిస్తామని చెప్పినప్పటికీ కోర్టు కేసుల నేపథ్యంలో అది ముందుకు సాగలేదు. ఎట్టకేలకు రేవంత్ రెడ్డి, సర్కారు ఉస్మానియా భవన నిర్మాణానికి నడుం బిగించింది.
గోషామహల్ ప్రాంతంలో ఇవాళ ఉదయం 11.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా కొత్త భవనా నికి శంకుస్థాపన చేయను న్నారు. కార్యక్రమంలో దాదాపు 1000 మంది పాల్గొనేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు.