*ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం*

 

*ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిచూసి ఓర్వలేకనే ప్రతిపక్షాల విమర్శలు*

 

 

డిసెంబర్ 03:. సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం 

 

 

నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించరు 

  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ :- 

 

*రాష్ట్రంలో రాక్షస పాలన అంతమై ప్రజాపాలన సంవత్సరకాలం పూర్తి చేసుకుంది.

*తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల, అమరవీరుల త్యాగాలను చూసిన సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే గతంలో అధికారంలో ఉన్న కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అన్ని రంగాలను విచిన్నం చేసి రాష్ట్ర పరిస్థితిని ఆగమ్యగోచరంగా మార్చారు.

*కేసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా పెంచిన బస్సు చార్జీల నుండి మహిళలకు విముక్తి చెందాలని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది 

*కెసిఆర్, మోడీ ఇద్దరు కలిసి 2014లో 410 రూపాయలు ఉన్న వంట గ్యాస్ సిలిండర్ను 1100 రూపాయలకు తీసుకువస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరకాలంలోనే వంట గ్యాస్ సిలిండర్ను 500 రూపాయలకు అందించడం జరిగిందన్నారు 

*పేద ప్రజలకు ఆసుపత్రిలో వైద్యం కొరకు తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీని గతంలో టిఆర్ఎస్ అపాహస్యం చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఐదు లక్షల ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షల వరకు పెంచుతూ 

రైతులకు రెండు లక్షల రుణమాఫీ, 500 రూపాయల బోనాసిస్తామని చెప్పి ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల వరకు రుణమాఫీ సన్నబడ్లకు బోనస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడమైంది 

*కానీ టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇవ్వదు అని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా కొందరు రైతులు తమ వడ్లను ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడం జరిగిందని వారి నష్టానికి టిఆర్ఎస్ నాయకులు కారణం కాద ఆని ప్రశ్నించారు.

*రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు.

 *టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏడు లక్షల కోట్ల అప్పుతో పాటు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సిఎంఆర్ఎఫ్ వంటి బిల్లులను దాదాపు 70,000 కోట్ల రూపాయలను పెండింగ్లో పెట్టడం జరిగింది.

 *రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే గతంలో పెండింగ్లో ఉన్న బిల్లులను మంజూరు చేస్తూనే ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు.

*గతంలో జిల్లాలో ప్రశాంత్ రెడ్డి గాని ,జీవన్ రెడ్డి గాని, కవిత గాని, గణేష్ గుప్తా గాని సీఎంఆర్ఓ అప్లికేషన్లు తీసుకున్నారు కానీ ఎవ్వరికీ చెక్కులు ఇవ్వలేదని కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 400 కోట్లు సీఎంఆర్ఫ్ కు మంజూరు చేసి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంవత్సర కాలంలోనే 827 కోట్లు సీఎంఆర్ఫ్ కోసం మంజూరు చేయడం జరిగింది.

 *గతంలో టిఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దళితులకు మూడు ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి, ఇంటికొక ఉద్యోగం ,డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని చెప్పి మోసం చేసింది.

 *కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్కొక్క హామీని నెరవేరుస్తుంటే విమర్శలు చేయడం చూస్తుంటే టిఆర్ఎస్ నాయకులకు, ప్రశాంత్ రెడ్డికి సిగ్గు లేదా అని ప్రశ్నించారు

 *టీఎస్పీఎస్సీని ఆట బొమ్మగా చేసి పేపర్ లీకేజీలతో విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న నీచ చరిత్ర టిఆర్ఎస్ ప్రభుత్వానిది.

*కానీ ఈరోజు టిఎస్పిఎస్సి ని ప్రక్షాళన చేసి పునర్ధరించి నిరుద్యోగ యువత కొరకు 50 వేల ఉద్యోగాలను నియమించిన ఘనత కాంగ్రెస్ పార్టీది

 *సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిపై అమలు చేసిన సంక్షేమ పథకాలపై మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని మరి ఎందుకు ప్రతిపక్షాలు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి బహిరంగ చర్చకు రావడం లేదు అని సవాలు ఎందుకు స్వీకరించడం లేదు అని మానాల మోహన్ రెడ్డి ప్రశ్నించారు 

*కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

 

ఈ కార్యక్రమంలో భీంగాల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బోదిరే స్వామి,వేల్పూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు నర్సారెడ్డి,జిల్లా NSUI అధ్యక్షులు వేణు రాజ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గంగా ప్రసాద్,డిసిసి డెలిగేట్ కుంట రమేష్,మాజీ ఎంపీపీ సురేందర్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగేంద్ర,గోపాల్ నాయక్,రాజు,కల్పన,అవినాష్,బోజగౌడ్,చరణ్,రాజేష్,నల్లూరి శ్రీను,సంతోషం,సురేష్,రమేష్,లింబద్రి,శంకర్,నితీష్,శివ క్రాంతి ,కిసాన్,గంగాధర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *