ఆర్మూర్ పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్షుడు చెరుకు పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వాలంటరీ దినోత్సవం పురస్కరించుకొని మన హెల్పింగ్ హాండ్స్ బ్లడ్ డోనర్స్ ఫౌండేషన్ ద్వారా ఆపదలో ఉన్నవారికి సరైన సమయంలో రక్తాన్ని అందిస్తూ వారి ప్రాణానికి ఎలాంటి హాని జరగకుండా మనం చేస్తున్నటువంటి బ్లడ్ డొనేషన్ గుర్తించి వారు మెమొంటో, శాలువాతో సన్మానించడం జరిగింది. రాబోయే రోజుల్లో మరింత సేవాలను విస్తృతం చేస్తూ ప్రజలలో మరియు సమాజంలో, యువతలో చైతన్యము తేవాలని వారు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ మెంబర్స్ రఫిక్, గుర్రం విజయనంద్, పోల మధుకర్, శ్రీధర్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.