భక్తి శ్రద్దలతో గిరి ప్రదక్షిణ…
వెంట నడిచిన భక్త జనం…
గోవింద నామ స్మరణతో మర్మోగిన గిరి ప్రాంతం..
సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం
నిజామాబాదు జిల్లా భీమ్ గల్ మండలంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం నింబాచల కొండపై శ్రీ వారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా బుధవారం శ్రీ లక్మీ నరసింహుని ఆయుధ శ్రేష్ఠమైన చక్ర స్వాముల వారిచే కొండ ప్రదక్షిణము నిర్వహించడం జరిగింది. ఉత్సవ యాగ సంరక్షణ కొరకు శ్రీ చక్ర స్వాముల వారిచే లింబాద్రి కొండ ప్రదక్షిణము జరిపారు. ఈ గిరి ప్రదక్షిణ ఏడాదిలో ఒక్కసారే ద్వాదశి రోజున నిర్వహిస్తారు. శ్రీ చక్ర స్వాముల వారిని పల్లకిలో పుష్పాలంక్రుతలను జేసీ, మంగళ వాయిద్యాలు, మేళ తాళముల మధ్య భగవంతుని సంకీర్తనలతో భక్త జనులు వెంటరాగ కొండ ( గిరి ) ప్రదక్షిణ గావించారు. సాక్షాత్తు శ్రీ లక్మీ నృసింహుని నివాస స్థలమైన నింబగిరి కొండకు ప్రదక్షిణము చేసేందుకు వచ్చిన భక్తుల జీవితం ధన్యము, మనోబిష్టములను స్వామి తప్పకుండ నెరవేరుస్తాడు. గిరి ప్రదక్షిణ సందర్బంగా కొండ గోవింద నామ స్వరణతో పులకించిపోయింది.