A9 న్యూస్ ప్రతినిధి నందిపేట్:
నందిపేట్ మండలం ఘర్షణ లో దాడి చేసిన వారిపై పోలిసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అరెస్టు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అంబేద్కర్ యువజన సంఘం, బిఎస్పీ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పోలిసుల నిర్లక్ష్య వైఖరిని నిరశిస్తు నందిపేట్ బస్టాండ్ ఎదుట బిఎస్పీ ఎవైఎస్ అధ్వర్యంలో షాపూర్ గ్రామస్థులు నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షులు సింగడే పాండు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఈశ్వర్, నందిపేట్ మండలం ఏ వై ఎస్ , బీఎస్పీ అధ్యక్షులు బోర్రోళ్ల సురేష్, మండలం ప్రధాన కార్యదర్శి బొంత సురేష్ లు మాట్లాడుతు..ఈనెల 3వ తేదీన నందిపేట్ మండలం షాపూర్ గ్రామ నివాసి తేలు మల్లయ్య కి నందిపేట్ నుండి షాపూర్ వెళ్ళు మార్గ మధ్యంలో ముత్యాలమ్మ గుడి నందిపేట్ దగ్గర బైక్ ,కారు డికొన్నాయి మల్లయ్యకు తీవ్ర గాయల పాలయ్యడు అతడ్ని హుటాహుటిన నందిపేట్ హాస్పిటల్ కి పంపించి కారు వాళ్ళ వివరాలు తెలుసుకునే క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది దాడి లో షాపూర్ గ్రామానికి చెందిన కొమిరే సుధాకర్ కాలు విరుగగా దీనిపై నందిపేట్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం జరిగింది. రోడ్డు ప్రమాదానికి కారకులను నిజామాబాద్ వసూలుగా గుర్తించి కేవలం 9 మంది పైన మాత్రమే ఎఫ్ ఐ ఆర్ చేయడం జరిగింది. మిగతా వారిని ఐడెంటిటీ చేసి అరెస్ట్ చేయాలనీ పలుమారు స్టేషన్ కి వెళ్లి కోరగా పోలీసులు జాప్యం చేస్తున్నారు. రాజకీయ నాయకులకు తలోగ్గి కేసును నిరుగారుస్తున్నారు. ఇట్టి విషయాన్నీ తీవ్రంగా ఖండిస్తూ బిఎస్పీ & ఏ వై ఎస్ ఆధ్వర్యంలో మండలం కేంద్రం లో బస్టాండ్ ఎదుట నిరసన తెలపడం జరిగింది.నిందితులను రిమాండ్ చేయాలనీ, మిగతా వారిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలనీ కోరడమైనది. ఘటన స్థలానికి సి ఐ శ్రీధర్ రెడ్డి చేరుకొని వారికీ తప్పకుండ న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ఉపసర్పంచ్ శ్రీను, షాపూర్ గ్రామ వాసులు మురళి, తదితరులు పాల్గొన్నారు.