A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ పట్టణం పెర్కిట్ బైపాస్ లో నూతనంగా నిర్మించిన జీసస్ మిరాకిల్ మినిస్ట్రీస్ రూపాంతరం ప్రార్థన మందిరం లో జరుగుచున్న క్రైస్తవ సభలకు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అయిన ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి హాజరై సంఘ వ్యవస్థాపకులు ఆనంద్ పాల్ కి అభినందనలు తెలిపి, ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేయడానికి ముందుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వన్నెల దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ ,మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను భాయ్ , మార్కేట్ యార్డ్ డైరెక్టర్ బుస ముత్యం , కాంగ్రెస్ నాయకులు ఫాయీమ్ భాయ్,అజ్జు భాయ్,రాజు భాయ్, భుపెందర్,రవీందర్ రెడ్డి ,జిమ్మి రవి తదితరులు పాల్గొన్నారు.