హైదరాబాద్:
బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన కె.మల్లారెడ్డి పేరాలసిస్ తో అనారోగ్యానికి గురై నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స కోసం చేరడంతో …ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులు ద్వారా మంత్రి దృష్టికి తీసుకురాగా మెరుగైన చికిత్స కొరకు 2 లక్షల రూపాయల ఎల్వొసి మంజూరు చేయించి…ఎల్ఓసి కాపీ ని వారి కుటుంబ సభ్యులకు మంత్రి శనివారం హైదరాబాద్ లో అందజేశారు. నిరుపేదలమైన మాకు మెరుగైన వైద్య చికిత్స కొరకు 2 లక్షల రూపాయల ఎల్ఓసి మంత్రి గారు మంజూరు చేశారని, ప్రశాంత్ రెడ్డి గారి మేలు మర్చి పోలేమని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని ఆమె మరియు బాధిత కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలియజేసారు.