Monday, November 25, 2024

గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయాలి

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

నిజామాబాద్ జిల్లా A9 news.                 

ఆర్మూర్ పట్టణంలోని గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మికుల వేతనాలు పెంచి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాష్ట్ర జేఏసీ కన్వీనర్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసు, టి.జె.కే.యస్. యు జిల్లా అధ్యక్షులు గుర్రపు రాజేశ్వర్, సిఐటియు ఆర్మూరు మండల అధ్యక్షులు కుతాడి ఎల్లయ్య, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు సూర్య శివాజీ,లు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆర్మూర్ పట్టణంలో భారీ కార్మిక ప్రదర్శన నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని ఆర్మూర్ ఆర్డిఓకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ మొండి వైఖరి ని వెంటనే విడనాడి, తక్షణమే ఆర్టీసీ కార్మికుల మాదిరిగానే, గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, లేనిచో సఫాయి కార్మికుల కోపానికి బలి కావడం కావడం ఖాయమని వారు అన్నారు. నెల రోజుల నుండి సమ్మె చేస్తా ఉంటే, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కమిటీల పేరుతోనే కాలయాపన చేయడం తగదని వారు అన్నారు. ప్రభుత్వం 11వ పిఆర్సి ప్రకారం జీవో నెంబర్ 60లో పేర్కొన్న దాని విధంగా సఫారీ కార్మికులకు 15,600, కారోబార్, బిల్ కలెక్టర్, ట్రాక్టర్ డ్రైవర్, ఎలక్ట్రిషన్లకు, 19500 వేతనం ఇవ్వాలని జేఏసీ డిమాండ్ చేస్తుందని వారు తెలిపారు. దేశానికే ఆదర్శమంటున్న కెసిఆర్ సఫాయి కార్మికులు నెల రోజులుగా సమ్మె చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. సఫాయి కార్మికులకు పెట్టిన సెల్యూట్ రాష్ట్రంలో బూటకమేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 12,769 పంచాయతీల్లో 50వేల కుటుంబాల భవిష్యత్తుతో చెలగాటమాడటం ఎలా సరి అయిందని వారు నిలదీశారు. వీ.ఆర్.ఏ, ఆర్టీసీ, కార్మికులను పర్మినెంట్ చేసినట్లుగా జీ.పీ కార్మికులను పర్మినెంట్ ఎందుకు చేయడం లేదొ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఎర్రబెల్లి దయాకర్రావు, గంగుల కమలాకర్, వినోద్ కుమార్ నాయకత్వంలో సబ్ కమిటీ వేసిన చర్చలకు పిలువకపోవడం అర్థంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదువుకున్న కారోబార్ పనిచేస్తున్న వాళ్లకు సహాయ కార్యదర్శిగా పదోన్నతి కల్పించాలన్నారు. ప్రమాద బీమా 10 లక్షలు, సాధారణ భీమా ఐదు లక్షలు పోస్ట్ ఆఫీస్ లో కట్టాలని, అందరికీ పిఎఫ్, ఈఎస్ఐ చట్టాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఒక దిక్కు నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే, పంచాయతీ ఉద్యోగ, కార్మికుల వేతనాలు భూమి మీదనే ఉన్నాయని వారు తెలిపారు. ఎమ్మెల్యేల వేతనాలు మీరు దేశంలో ఎక్కడ లేని విధంగా పెంచుకొని, అతి తక్కువ వేతనాలతో మా కార్మికుల బతుకులును అంధకారంగా మార్చడంలో మర్మమేమిటని వారు అన్నారు. ఎనిమిది గంటల పని విధానాన్ని యధా విధంగా కొనసాగించాలని, నరేంద్ర మోడీ తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తెలంగాణలో అమలు సాధ్యము కాదని రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేయాలని వారు కోరారు.మల్టీ పర్పస్ విధానాన్ని జీవో నెంబర్ 51 వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. పాత కేటగిరి లన్నింటిని యధావిదంగా కొనసాగించాలని వారు అన్నారు. పని ఒత్తిడిని తగ్గించాలని వారు కోరారు. స్వచ్ఛ్ తెలంగాణ, స్వచ్ఛ భారత్ లో ముందువరుసలో పాల్గొనే పంచాయతీ కార్మికులకు ప్రత్యేక నిధిని కేటాయించాలని, పండుగ, జాతీయ, అర్జిత సెలవులు వారాంతపు సెలవులు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ధనవంతమైన రాష్ట్రంలో సఫాయి కార్మికుల జీవితాలు దరిద్రంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కొనుగోలు శక్తిని పెంచడానికి వేతనాలు పెంచి పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిచో కార్మికుల కోపానికి బలికాక తప్పదని వారు హెచ్చరించారు. ప్రజారోగ్యం కోసం తపించి, కొవ్వొత్తుల పనిచేసే సఫాయి కార్మికులను ఇబ్బందులు పెట్టడం భావ్యం కాదని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సవీన్, భానుచందర్, శ్రీపాద బాలయ్య, వెంకటాపూర్ గంగారాం, నంబూరి ప్రసాద్, సదానంద్, సొప్పరి గంగాధర్, చింతలూరు సాయన్న, రాంపూర్ పోసాని, బాల్కొండ సంజీవ్, గోపి, ఐఎఫ్టియు సాయిబాబా, సిఐటియు నాయకులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here