Monday, November 25, 2024

జులై 1నుండికొత్త క్రిమినల్ చట్టాలుఅమలులోకి

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img
  • *జులై 1 నుండి క్రిమినల్ చట్టాలు మరింత కఠినం..*

 A9న్యూస్ బాల్కొండ నియోజకవర్గం: జూన్ 29

స్వల్ప నేరాలకు పెట్టీ కేసులు వంటివాటిని ఇందులో చేర్చారు.

 

 మహిళలు, పిల్లలు, హత్య, రాజ్య వ్యతిరేక నేరాలపై శిక్షలను కేంద్రం కఠినతరం చేసింది . 

 

కొన్ని నేరాలకు స్త్రీ పురుషులనే తేడా లేకుండా సమానంగా శిక్ష పడేలా యాక్ట్ రూపొందించారు.

 

 ఆర్గనైజ్డ్‌ క్రైమ్స్, టెర్రరిస్ట్ యాక్టివిటీ, తీవ్రవాదానికి చెక్‌ పెట్టేందుకు శిక్షలను స్ట్రిక్ట్ చేశారు.

 

 సాయుధ తిరుగుబాటు, విధ్వంసం, వేర్పాటువాదం..లేదా దేశ సార్వభౌమత్వం, ఐక్యతకు భంగం కలిగించే యాక్టివిటీస్‌పై సీరియస్‌ యాక్షన్‌ తీసుకునేలా ఈ చట్టంలో అంశాలను చేర్చారు.

 

 కొన్ని నేరాలకు జరిమానాలు, శిక్షలను పొడిగించారు.

 

బలవంతపు వసూళ్లు, క్రైమ్‌ సిండికేట్‌ కోసం చేసే సైబర్‌ నేరాలు, ఆర్గనైజ్డ్‌ క్రైమ్స్‌ కు కఠినమైన చర్యలు ఉంటాయి..

 

కులం, భాష లేదా వ్యక్తిగత గుర్తింపు కోసం ఐదుగురు లేక అంతకంటే ఎక్కువమందిని హత్య చేస్తే.. నిందితులకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష పడే అవకాశం ఉంటుంది.

 

నేరానికి సంబంధించి బాధ్యుడిని చేసే వయసును ఎప్పటిలానే ఏడేళ్లకు కొనసాగించారు..

 

ఓ వర్గంపై దాడుల్లో ఓ వ్యక్తి చనిపోతే అందుకు కారణమైనవారికి జీవితఖైదు లేదా మరణశిక్ష, ఫైన్ పడనుంది..

 

నేర తీవ్రతను శిక్షలను కఠినతరం చేసింది కేంద్రం. ఒక వ్యక్తి మరణానికి కారణమైతే రూ.10లక్షల వరకు జరిమానాతో పాటు మరణశిక్ష లేదా జీవితఖైదు వేసేలా చట్టాల్లో మార్పులు తెచ్చారు…

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here