కామారెడ్డి జిల్లా A9 news
సదాశివ నగర్ ఎస్సై గా ఎన్. రాజు బాధ్యతలు స్వీకరించారు నిజాంసాగర్ మండల్ ఎస్సైగా రాజు విధులు నిర్వహించి బదిలీపై సదాశివ నగర్ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై రాజు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలందరూ భాగ్యసామ్యులు కావాలన్నారు. మండలాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని అన్నారు. ప్రజలు ప్రజాప్రతినిధులు పోలీసులతో సహకరించాలని కోరారు, అలాగే ప్రస్తుతం సైబర్ నేరాల పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా యువత ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించుకోవాలని తెలిపారు. రుణాలు ఉద్యోగులు షాపింగ్ ల పేర్లతో సైబర్ నెరగాళ్లు రెచ్చిపోతున్నారని చెప్పారు, ఇలాంటి వాటిపై అవగాహన లేకుండా స్పందించి నష్ట పోతున్నారని ఒకవేళ సైబర్ మోసానికి గురై డబ్బులు నష్టపోతే వెంటనే 1930 నెంబర్ కు కాల్ చేయాలని సూచించారు. ప్రజల ఆపద అత్యవసర సమయంలో డయల్ 100 కు కాల్ చేసి సహాయం పొందాలని పేర్కొన్నారు రోడ్డు భద్రాచలం భాగంగా వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడం, మద్యం సేవించడం రాంగ్ రూట్లో ప్రయాణం, త్రిబుల్ రైడింగ్ లాంటి చేయరాదని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ అందరూ భాగ్యసామ్యులు కావాలని ఆయన సూచించారు ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు అతివేగంగ వాహనాలు నడపరాదని మైనర్లకు వాహనం ఇవ్వరాదని తల్లిదండ్రులకు విజ్ఞప్తి సదాశివ నగర్ ఎస్సై ఎన్ రాజు సూచించారు.