*గ్రామంలో నీటి కరువు ఏ అధికారి ఆ గ్రామాన్ని పట్టించుకోలేక పోవడం గమనార్థం .

*గ్రామస్తులు అందరూ కలిసి చందాలు వేసుకుని బోరు వేయించుకొని ఆదర్శంగా నిలుస్తున్న ఆ గ్రామస్తులు.

కామారెడ్డి జిల్లా ,సదాశివనగర్ మండల్ ,లింగంపల్లి గ్రామంలో,

గత నెల రోజుల నుండి నీటి సమస్యతో తీవ్ర ఇబ్బంది. పడుతున్న గ్రామస్తులు ఎంపీ ఎమ్మెల్యే కలెక్టర్ వరకు ఎవరి సహాయం లేకుండా ఏ నాయకుడు చేయని పనులను సైతం గ్రామ ప్రజలు ప్రతి ఇంటికి 500 రూపాయల చొప్పున జమ చేసుకొని గ్రామానికి సంబంధించిన రెండు బోర్లు నీటి కరువుతో కటకట లాడగా నూతన బోరు కోసం గ్రామ మాజీ తాజా సర్పంచులతో సహా గ్రామ వివిధ పార్టీల అధ్యక్షులు ,మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, మాజీ తాజా జెడ్పిటిసి ,ఎంపిటిసిల తో సైతం ఎంపీ, ఎమ్మెల్యే ,కలెక్టర్ కి గోడు వినిపించుకున్న ఎవరు ఎలాంటి సహాయం చేయనప్పటికీ గ్రామ ప్రజలు వి డి సి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి 500 రూపాయల చొప్పున జమ చేసుకొని నూతన బోరు దాదాపు అక్షరాల రెండు లక్షల 50 వేలతో అలాగే కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులో లేనటువంటి బావిని నూతన పైప్ లైన్ తో సుమారు 30 వేల రూపాయలు ఖర్చు పెట్టి రిపేర్లు చేయించి నీటి దాహం తీర్చుకుంటున్న గ్రామస్తులు తెలిపారు.  అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారని ఇటీవలే కలెక్టర్ టోల్ ఫ్రీ నెంబర్ కి మొరపెట్టుకున్నప్పటికీ ఎలాంటి మార్పు రాలేదని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిన ఎలాంటి సహాయక చర్యలు అందలేదని గ్రామస్తులే ముందడుగు వేసి తమ గ్రామ సమస్యను తామే పరిష్కరించుకుంటున్నారు..గ్రామస్తులు ప్రతి గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ఈ ప్రభుత్వం ఉండి లేనట్టుగా ఉందని ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్న తమ చిన్న నీటి సమస్య కూడా తీర్చలేనంతా దౌర్భాగ్యమైన స్థితిలో లో ఈ ప్రభుత్వం ఉందని అందుకే తమ గ్రామ సమస్యను తామే పరిష్కరించుకుంటున్నామని వాళ్ల ఓట్ల కోసం మాత్రమే ప్రజల దగ్గరకు వస్తారని, ఏ ఒక్క సమస్యను కూడా తీర్చలేదని అలాంటప్పుడు ఈ ప్రభుత్వాలు ఉన్నా లేకున్నా ఒకటే అని గ్రామస్తులు వాపోతున్నారు ..ఇప్పటికైనా ఎమ్మెల్యే మధన్ మోహన్ నూతన బోర్ కి సహకరించి బోర్ కి పెట్టిన ఖర్చు నీ బిల్ చేయించి గ్రామస్తులకు ఇపాయ్యాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *