కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో స్ప్రింగ్ ఫీల్డ్ హై స్కూల్ వద్ద ఏఎస్ఐ గంగాసాగర్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేశారు .వాన దారులకు పలు సూచనలు చేసినారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని ఇస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని వారు అన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ లైసెన్స్ ఆర్ సి దగ్గర ఉంచుకోవాలని వారు అన్నారు ప్రతి ఒక్క వాహనదారుడు సీట్ బెల్ట్ ధరించాలని వాన దారులకు పోలీసులు సూచించారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల నివారణ అరికట్టవచ్చని ఏఎస్ఐ గంగాసాగర్ అన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ గంగాసాగర్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.