నమస్తే తెలంగాణ దినపత్రికలను దగ్ధం
చేసిన కాంగ్రెస్ నాయకులు
సదాశివ్ బచ్చగొని A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం
కమ్మర్పల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో
గత రెండు రోజుల క్రితం బేగంపేట్ విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు గారు బేగంపేట ఎయిర్పోర్ట్ లో రెండు రోజుల క్రితం రహస్యంగా భేటీ అయ్యారని రాజకీయంగా రహస్య చర్చలు జరిగాయని కేసీఅర్ గురువు చిన్న జీయర్ స్వామి కలలోకి వచ్చి చెప్పినట్లు కెసిఆర్ దినపత్రిక అయిన నమస్తే తెలంగాణ పత్రికలో కల్పిత రాతలు రాసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేవిధంగా దిక్కుమాలిన రాతలు రాసిన నమస్తే తెలంగాణ దినపత్రికలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కమ్మర్పల్లి మండల కేంద్రంలోదగ్ధం చేయడం జరిగింది.
దీని సందర్భంగా పిసిసి అధికార ప్రతినిధి
బాస వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ కెసిఆర్ కు కేటీఆర్ కు టిఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత తండ్రి కొడుకులకు మతిభ్రమించి ఏం చేయాల తోయక కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా తన గుమ్మాస్త పత్రికలో కల్పిత రాతలు రాస్తూ తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న నమస్తే తెలంగాణ పత్రిక యాజమాన్యంపై నాన్ బేలబుల్ సెక్షన్లను నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన వార్తల వెనుక ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ కుట్ర కూడా ఉందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నాము కెసిఆర్ కు జగన్ ఆప్త మిత్రుడని అని వీరిద్దరూ కలిసి తెలంగాణలో రాజకీయ అలజడులు సృష్టించి
గజ దొంగల్లా వ్యవహరుస్తు ఆరోపిస్తున్నాము ఇక్కడ ఉన్నది పేదవాడి దైర్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న సంగతి మర్చిపోవద్దని హెచ్చరిస్తున్నాను
అధికారం పోయినప్పటి నుంచి తండ్రి కొడుకులు ఆడుతున్న మైండ్ గేమ్ రాజకీయాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని అసలు బేగంపేట ఎయిర్పోర్ట్ కి గురువారం రోజున ముఖ్యమంత్రిగారు రేవంత్ రెడ్డి
పొక పోయిన పొనట్లు ఊహాజనితంగా రాతలు రాయించడం మానుకోవాలని కెసిఆర్ కేటీఆర్ ను హెచ్చరిస్తున్నాం అసలు నమస్తే తెలంగాణ పత్రికను ఒక పేపర్ లాగా చూసే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని అన్నారు
చంద్రబాబు నాయుడు ని కలవవలసిన కర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదని స్పష్టం lచేశారు చంద్రబాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గార్లది గురు శిష్యుల బంధం కాదని తనది వాళ్ళ పార్టీ లో ఉన్నప్పుడు సహచరడు నని ఏనాడో రేవంత్ రెడ్డి గారు స్పష్టo
చేశారని గుర్తు చేస్తున్నాను. మీ కల్పిత రాతలను కళ్ళు బోల్లి మాటలను నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధికార ప్రతినిధి ఏలేటి గంగాధర్ కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగల ప్రవీణ్. పాలెపు నరసయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవతి గంగాధర్ .ప్రదీప్ జగదీశ్ చారి వైన్స్ గంగారెడ్డి అవారి సత్యం బోనగిరి లక్ష్మణ్ గణేష్ గుప్తా శశి తదితరులు పాల్గొన్నారు