*హరహర మహ దేవ …. శంభో శంకర -శివనామ స్మరణతో మారుమోగిన శైవక్షేత్రాలు*
సదాశివ్ బచ్చగొని A9న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం
హరహర మహ దేవ ….. శంభో శంకర అంటూ భక్తుల శివనామ స్మరణతో శైవక్షే తాలు మారుమోగాయి. నిజామాబాదు జిల్లా భీమ్ గల్ మండలంలో మహా శివరాత్రి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరి గాయి. దక్షణ కాశీగా పేరుగాంచిన బాబానగర్ వద్దగల పురాతన శ్రీ రాజా రాజేశ్వరస్వామి(లింగం) ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్వామి వారికీ ఉదయం నుండి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారు జామునుండే భక్తులు లింగామాయ్యను దర్శించుకొన్నారు. ఉదయం నుండే ఆలయం వద్ద పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. ఇరత ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలా డింది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు మొక్కులు సమర్పించుకున్నారు. పుట్టు వెంట్రుక లు, బెల్లంతో తులాభారం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉపవాస దీక్షలతో అధిక సంఖ్య లో భక్తులు శుక్రవారం అర్ధరాత్రి స్వామీ వారికి జరిగే మహరుద్రభిషేకంలో, స్వామీ భక్తులు పాల్గోని ఆలయంలోనే శివరాత్రి జగరణ చేస్తారు. శనివారం ఉ దయం మారోమారు రాజేశ్వరుడిని దర్శించుకొని స్వస్థలాలకు వెళ్తారు. స్థానిక కమిటీ అధ్వర్యంలో భక్తులకు అవసరమైన ఏర్పాటు చేశారు. సుమారు మూడు వేలకు పై గా మంది భక్తులు జాతర ఉత్సవాల్లో పాల్గొని స్వామి వారి దర్శణం చేసుకున్నారు. అదేవిధ గా మండలంలోని కుప్కాల్,భీమ్ గల్ , బడా భీమ్ గల్,సికింద్రాపూర్,ఆలయల్లో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం శివపార్వతుల కళ్యాణం కన్నుల పండు గగా నిర్వహించారు. . …జాగరణ లో భాగంగా బాబానగర్,భజన మండలి వారిచే భజన కార్యక్రమాలు భక్తులను పరవాశింప చేశాయి.