క్షత్రీయ స్కూల్ చేపూర్ నందు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా – నిర్వహింపబడిన పతాకావిష్కరణ కార్యక్రమంలో క్షత్రీయ విద్యాసంస్థల అధిపతి అల్జాపూర్ శ్రీనివాస్ , కోశాధికారి అల్జాపూర్ గంగాధర్ , సెక్రటరి అల్జాపూర్ దేవేందర్ , స్కూల్ డైరక్టర్ అల్జాపూర్ వీరేంద్ర , ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహ స్వామి , విద్యార్థుల తల్లి దండ్రలు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గోన్నారు. అల్జాపూర్ శ్రీనివాస్ పతకావిష్కరణను గావించి, విద్యార్థుల గౌరవ వందనం స్వీకరంచారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం లభించిన తర్వాత సుపరిపాలన కొరకై ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం 1950 జనవరి 26 వ తేది నుండి ఆమలు పరచుకొన్నామని అందుకే ఈ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత విద్య, పరిపూర్ణ వ్యక్తిత్వం ను కలిగియుండాలని అన్నారు . విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ ను తీర్చిదిద్దాల్సిన భాధ్యత ప్రతి ఉపాధ్యాయునిపై ఉన్నదని ఆన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు, సమాజానికి మార్గ దర్శకులని శ్రీనివాస్ అన్నారు. ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహ స్వామి మాట్లాడుతూ దేశ స్వాత్యంత్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల ఆడుగు జాడల్లో నడిచి పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా తయారు కావాలని ఆకాంక్షించారు. ఇందుకోసం క్షత్రియ ఉపాధ్యాయ బృందం ఎనలేని కృష చేస్తుందని స్వామి అన్నారు.ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థుల నృత్య ప్రదర్శనలు చూపరులను ఎంతగానో ఆలరించాయి. విద్యార్థుల సైనిక బెటాలియాన్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాద్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.