Tuesday, November 26, 2024

మున్సిపల్ లో అవిశ్వాసం వీగిపోయింది

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

నిజామాబాద్ A9 న్యూస్ జనవరి 26:

* చైర్ పర్సన్ గా పండిత్ వినితను కొనసాగించాలి….

* మీడియా సమావేశంలో పాల్గొన్న కౌన్సిలర్లు, నాయకులు….

ఆర్మూర్ మున్సిపాలిటీలో జనవరి 4వ తేదీన నిర్వహించినటువంటి అవిశ్వాస తీర్మానం వీగిపోయినందున ప్రభుత్వం మున్సిపల్ చైర్ పర్సన్ గా పండిత్ వినీతను కొనసాగించాలని కౌన్సిలర్ లు బాదం రాజ్ కుమార్, మురళీధర్ రెడ్డి, నాయకుడు పండిత్ పవన్ లు తెలిపారు.

ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుడిని కలిపి 37 మంది సభ్యులు ఉన్నారన్నారు. ఈనెల 4న జరిగిన అవిశ్వాస పరీక్షలో 37 మందిలో 24 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతుగా చేతులు లేపారన్నారు.

ఎక్స్ అఫీషియో సభ్యునిగా సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తటస్థంగా ఉన్నారని వివరించారు. ఈ అవిశ్వాస పరీక్షలో 2/3 వంతు మెజార్టీతో నెగ్గాలంటే 25 మంది సభ్యులు బలపరిస్తే అవిశ్వాసం నెగ్గేదన్నారు. కానీ 24 మంది మాత్రమే అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపినందున అవిశ్వాస తీర్మానం విరిగిపోయిందన్నారు.

ఈ విషయాన్ని తాము జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కు వివరించినట్లు తెలిపారు. అవిశ్వాసం విగిపోయినందున మున్సిపల్ చైర్ పర్సన్ గా పండిత్ వినీతను కొనసాగించాలని వారు కోరారు.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు చొరవ తీసుకొని పండిత్ వినితను మున్సిపల్ చైర్ పర్సన్ గా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు హనుమాన్లు, నాయకులు చందు మీనా, ఎస్ ఆర్ రమేష్, శివ, పండిత్ ప్రేమ్, రింగుల భూషణ్ పాల్గొన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here