నిజమాబాద్ A9 న్యూస్ జనవరి 26:
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు,కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిజామాబాద్ నగరంలో అఖిల భారత రైతు కూలి సంఘము, ఇఫ్టు, పి.డి.ఎస్.యూ ఆధ్వర్యంలో ట్రాక్టర్, బైక్ ర్యాలీ నిర్వహించరు.
ఈ సందర్భంగా సీపీఐ(యం-యల్)న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ మూడు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చాడని, దానిని దేశ రాజధానిలో రైతుల ఆందోళనల ఫలితంగా వెనక్కి తీసుకున్నారని,
రైతుల ఆత్మహత్యలు అరికట్టేందుకు కనీస మద్దతు ధరల చట్టం తీసుకురావాలని, రైతులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయలని, రైతుల రుణాలను మాఫీ చేయాలని, 2006 అటవీ హక్కుల చట్టాన్ని పగడ్బందిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇఫ్టు జిల్లా అధ్యక్షుడు బి.భూమన్న మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ను అపాలని, నిత్యవసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు దేశెట్టి సాయిరెడ్డి, సూర్య శివాజీ, ఖాజా మోహినుద్దీన్, శివకుమార్, జన్నారపు రాజేశ్వర్, జె పి గంగాధర్, భారతి, దేవస్వామి, గంగన్న, బన్సీ, ప్రిన్స్, వంశీ, ఎల్లప్ప, శంకర్ తదితరులు పాల్గొన్నారు.