నిజామాబాద్ జిల్లా A9న్యూస్ :
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో ఈరోజు నంది గుడి ఆలయ నూతన కమిటీ తొలి సమావేశంనిర్వహించి, ఆలయ చరిత్రను, ఆలయంలోని శివలింగ మహత్యాన్ని, ఆలయంలోని నంది తొలినాళ్లలో చిన్నదిగా ఉండి, క్రమంగా పెరిగి, నందీశ్వరుని పేరుతోనే ఈ గ్రామానికి నందిపేట అనే పేరు వచ్చిన క్రమాన్ని, చరిత్రకారుల కృషితో డాక్యుమెంటరీ చేయడానికి తీర్మానించడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో వీరభద్ర స్వామి గోపురాన్ని నిర్మించడానికి సంకల్పించడం జరిగింది. ఆలయంలో ఇకనుండి నిత్య ప్రసాదం అందించాలని,ఆలయానికి ఆదాయం వచ్చే విధంగా ఐదు మడిగలను నిర్మించి, ఆలయ ప్రాంగణంలో సుందరీకరణ పనులు చేయడానికి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మచ్చర్ల సాగర్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నవీన్, మచ్చర్ల చిన్న సాయన్న, ప్రసాద్, వైస్ చైర్మన్ చింతల కిషన్, కోశాధికారి ఎర్రం నడిపి ముత్యం, డైరెక్టర్లు ఎర్రం ప్రవీణ్, నడుకుడ శ్రీను, తాటికాయల సుభాష్, ఆర్మూర్ గంగారం,మూడేడ్లలింగం, బుక లింబాద్రి, వాల్గోట్ రాజు, దేవతి లింగంచెలిమెల విటల్, మాడబోయి గణేష్, సుంకర సుమన్, కుమ్మరి శ్రీకాంత్,పాల్గొన్నారు.