నిజామాబాద్ A9 న్యూస్:
క్షత్రియ స్కూల్ చేపూర్-ఆర్మూర్
గత రెండు రోజులుగా క్షత్రియ స్కూల్ చేపూర్ – ఆర్మూర్ నందు నిర్వహించబడుచున్న విజ్ఞాన మేళా కార్యక్రమ ముగింపు సమావేశాన్ని ఈ రోజు నిర్వహించినారు. ఈ కార్యక్రమాన్ని ఇతర పాఠశాలల విద్యార్థులు వీక్షించి అనేక కొత్త విషయాలను తెలుసుకున్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మీ నరసింహ స్వామి మాట్లాడుతూ విజ్ఞాన మేళా నమునాలు విద్యార్థుల సృజనాత్మకత మరియు ఉపాధ్యాయుల సమిష్టి కృషికి నిదర్శనమని అన్నారు. మధ్యాహ్నం నుండి పాఠశాలలో సంక్రాంతి ముందస్తు సంబరాలను ఎంతో ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమాన్ని క్షత్రియ విద్యాసంస్టల కోశాధికారి అల్జపూర్ గంగాధర్ జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించినారు. పల్లెల్లో జరిగే సంక్రాంతి పండుగ నేపధ్యంలో ఒక గుడిసె ను వేసి దాని ముందర భోగి మంటలు వేసినారు. సంక్రాంతికి వచ్చే కీడును తొలగించడానికి సూచికగా చిన్న పిల్లల పై పైన నేరేడు పండ్లను, ఎండు ద్రాక్ష పండ్లను సున్నితంగా పోసినారు. విద్యార్థుల బొమ్మల కొలువు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. గంగిరెద్దుల వేషధారణ, హరిదాసు కీర్తనలు అందరని అలరించాయి. ఈ సందర్భంగా గంగాధార్ మాట్లాడుతూ హిందూత్వంలో ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంటుందని, పండుగలు ప్రకృతి తో మమేకమై ఉంటాయని, రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఈ పండుగకు ఇంటికి చేరుకుంటాయని, రైతుల కళ్ళలో ఆనందం వెల్లు విరుస్తుందని అన్నారు. సెక్రెటరీ దేవేందర్ మాట్లాడుతూ సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించే రోజు మకర సంక్రాంతి అని అన్నారు. సంక్రాంతి పండుగకు నెల రోజుల ముందు వచ్చే ధనుర్మాస విశిష్టతను వివరించినారు. బాలికలు మొత్తం 106 ముగ్గులను అందంగా, చూడ ముచ్చటగా వేసినారు. బాలురు గాలిపటాల పోటీలో పాల్గొన్నారు. ఆ తర్వాత సంక్రాంతి పాటలతో విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థిని-విద్యార్థులు పాల్గొన్నారు.