నిజామాబాద్ A9 న్యూస్:
మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామంలో పవన్ స్కూల్ ఆవరణలో సంక్రాంతి వేడుకలు స్కూల్ టీచర్లు విద్యార్థినీ విద్యార్థులు పిల్లల ప్రవీణ్ స్కూల్ ఆవరణలో సంక్రాంతి ఉత్సవాలను గొబ్బెమ్మలతో రంగురంగుల ముగ్గులతో భోగి మంటలు పెట్టి పిల్లలు పతంగులు ఎగురవేస్తూ పండుగ సంప్రదాయాలను పిల్లలు వేషధారణతో గంగిరెద్దులుగా హరిదాసులుగా వేషాధారణతో అలంకరించుకొని సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు. ఈ పండుగలు పిల్లల ఉత్సాహాన్ని చూసి కరెస్పాండెంట్ పవన్ వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లల సంక్రాంతి పండుగను కండ్లకు కట్టుగా పిల్లలతో జరిపించారని తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్కూల్ కరస్పాండెంట్ పవన్ పిల్లలకు తల్లిదండ్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.