నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ చక్కని సాంప్రదాయక దుస్తులతో చక్కగా వచ్చారు అంటే కాకుండా రంగు రంగుల ముగ్గులతో పాఠశాల ఆవరణాన్ని చక్కగా అలరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రాంగణంలో బొమ్మల కొలువు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులందరి పైన భోగి పండ్లు వేసి వారిని ఆశీర్వదించారు ఇలా భోగి పండ్లు వేయడం ద్వారా చిన్నారుల పై ఉన్న నరదృష్టి పోతుందని వారికి చక్కని జ్ఞానం లభిస్తుందని నిండు నూరేళ్లు ఆయుష్షుతో ఉంటారని తెలిపారు, అంతేకాకుండా విద్యార్థులందరూ బొమ్మల కొలువు దగ్గర ఎంతగానో సందడి చేశారు. ఆ తర్వాత సంక్రాంతి పండుగ సందర్భంగా విద్యార్థులందరూ గాలిపటాలు ఎగరవేశారు, అంతేకాకుండా పాఠశాల ప్రాంగణంలో రంగురంగుల ముగ్గులు వేసి హరిదాసు వేషంతో జస్విన్ అనే విద్యార్థి అందర్నీ ఎంతగానో ఆకట్టుకున్నాడు అంతేకాకుండా చక్కని పిండి వంటకాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ హిందువుల ముఖ్యమైన పండగ అని దీనిని మూడు రోజులు జరుపుకుంటారని పండగ యొక్క విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు, అంతేకాకుండా ఇలా బొమ్మల కొలువు చేయడం విద్యార్థుల పైన భోగి పండ్లు వేసి తమ చిన్నారులందరు మంచి జ్ఞానంతో భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలని తెలియజేశారు అంతేకాకుండా పాఠశాల ప్రాంగణంలో పాలు పొంగించి విద్యార్థులందరూ చక్కని నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.