నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో డొంకేశ్వర్ గ్రామంలోని సత్య గణపతి మండపంలో ప్రత్యేక పూజలు జరిపి, అన్నదాన సత్రానికి, 25 క్వింటాళ్ల బియ్యం ఆశన్నగారి రాజేశ్వర్ రెడ్డి సమర్పించడం జరిగింది. ముక్కోటి దేవుళ్లలో తొలి పూజలు అందుకునే గణనాథుడికి అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నటువంటి డొంకేశ్వర్ గ్రామం, ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా, భవిష్యత్తులో రూపుదిద్దుకుంటుందని, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో, గ్రామస్తులందరి ఆమోదంతో, పెద్ద ఎత్తున నిధులు కేటాయించడానికి ఎమ్మెల్యే కృషి చేస్తారని రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల ఎంపీపీ వాకిడి సంతోష్ రెడ్డి, నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్, ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్, డొంకేశ్వర్ గ్రామ సర్పంచ్ నాయకుడు చందు, గ్రామ శాఖ అధ్యక్షుడు గంగాసాగర్, ఎంపీటీసీ శ్రీకాంత్, మండల ఎస్సి విభాగం అధ్యక్షుడు సంజీవ్, సీనియర్ నాయకులు కుంట రాములు, మల్లారెడ్డి, గోక భోజరెడ్డి, వీడిసి నాయకులు కళ్యాణ్, లిఫ్ట్ చైర్మన్ నర్సారెడ్డి, వీడిసి సభ్యులు గ్రామ ప్రజలు నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.