ఆర్మూర్ లోని నలంద స్కూల్లో శనివారం ఘనంగా RMM పరీక్ష ను నిర్వయించారు.
ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులకు ఒలింపియాడ్ మాథ్స్ మహోత్సవం పరీక్ష .హైస్కూల్ విద్యార్థులు IIT గణితం మహొస్తవ్ పరీక్ష నిర్వయించారు.
ఈ పరీక్ష మన తెలంగాణ , నిజాంబాద్ జిల్లాలో ఆర్మూర్ లో నలందా స్కూల్ , మరియు ఆంధ్ర ప్రదేశ్ లో దగ్గర దగ్గరగా 500 స్కూల్స్ కూడా ఈ పరీక్షను నిర్వయించారు. ఇ పరీక్ష పాఠశాల స్థాయి లో మరియు రాష్ట్ర స్థాయి లో కూడా నిర్వయిస్తారు.ఈందులో గణితం మరియు సైన్స్ పరీక్షలు నిర్వహిస్తారు.ఈ రోజు గణిత మహోత్సవ పరీక్ష నిర్వహించారు.ఈట్టి పరీక్షలో పాఠ్యపుస్తకం లోని సిలబస్ కాకుండా సీబీఎస్ఈ సిలబస్ లో కూడా రావడం జరిగింది. ఇట్టి పరీక్షలో ప్రతి తరగతి నుండి పదిమంది విద్యార్థులు ఈ పరీక్ష లో పాల్గొంటారు. ఎందుకంటే ఈ పరీక్ష రాయడానికి విద్యార్థులు మాథ్స్ మరియు సైన్స్ లో పట్టు ఉన్న విద్యార్థులు మాత్రమే ఈ పరీక్ష రాయడానికి అర్హులు ఈ ఒలంపియాడ్ విద్యార్థులకు ఈ పరీక్ష వల్ల రానున్న హై స్కూల్ తరగతులకు చాలా దోహదపడతాయి, మరియు హై స్కూల్ విద్యార్థులకు ఈ ఐఐటి మాథ్స్ పరీక్ష వలన వారికి ఇంటర్మీడియట్లో వారికి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో చాలావరకు ఉపయోగపడతాయని, కరస్పాండెంట్ ప్రసాద్ సార్ గారు అన్నారు.
ప్రిన్సిపల్ సాగర్ సాగర్ మాట్లాడుతూ ఇట్లాంటి ఒలంపియాడ్ మరియు ఐఐటి పరీక్షలు నిర్వహించడం వలన విద్యార్థులు వారి భవిష్యత్తులో కాంపిటేటివ్ పరీక్షలకు సన్నద్ధం కావడానికి దోహదపడతాయి, మరియు ఇట్టి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ నిర్వహించడంలో నలంద స్కూలు నిజాంబాద్ జిల్లాలోని అన్ని స్కూళ్ల కంటే ముందుంటుందని చెప్పడానికి గర్విస్తున్నానని చెప్పడం జరిగింది. మరియు వచ్చే నెలలో సైన్స్ మరియు మిగతా కాంపిటేటివ్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది.
ఈ ఒలంపియాడ్ మరియు ఐఐటి పరీక్షల ఇంచార్జ్ టీచర్స్ అయినటువంటి అక్షయ్ సార్ , ప్రవీణ్ సర్, హనుమాన్ సారు మాట్లాడుతూ కార్పొరేషన్ స్కూల్ దీటుగా నలంద స్కూల్లో ఇట్లాంటి పరీక్షలు నిర్వహించడం మాకు సపోర్ట్ చేయడం వలన రానా రోజుల్లో విద్యార్థులకు వారికి మ్యాస్ మరియు సైన్స్ పైనే మక్కువ పెంచేందుకు మేము కూడా ప్రయత్నిస్తామని చెప్పడం జరిగింది. ఇట్టి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో మమ్మల్ని కూడా ఒక భాగం చేసినందుకు నలంద యాజమాన్యానికి, విద్యార్థులకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.