నిజామాబాద్ A9 న్యూస్:
ఆర్మూర్ పట్టణంలో పసుపు బోర్డు అంశం పై మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు
పిసిసి ప్రచార కమిటీ సభ్యులు కోలా వెంకటేష్ మాట్లాడుతూ పసుపు బోర్డు అంశం నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని పసుపు రైతుల చిరకాల కోరిక అని, ఆ సెంటిమెంట్ ని వాడుకొని హామీ ఇచ్చి గెలిచి నాలుగన్నర సంవత్సరాలుగా పసుపు బోర్డు ఏర్పాటు చేయక ఇప్పుడు మరొక్కసారి రైతులను మోసం చేయటానికి ఎంపీ అరవింద్ సిద్ధం అయ్యాడు అని అన్నారు,
గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పి మాట తప్పి రైతులను మోసం చేస్తే రైతులు ప్రతిఘటించటంతొ ముందునుండి ఉన్న స్పేసెస్ కార్యాలయంను నిజామాబాద్ కు మార్చి దీనినే పసుపు బోర్డు కంటే గొప్పది అని, మీరు అంబాసిడర్ కారు అడిగితె నేను బెంజ్ కారు లాంటిది తెచ్చాను అని చెప్పిన అరవింద్ మళ్ళీ ఇప్పుడు పసుపు బోర్డు తెస్తా అనడం ఆయన విజ్ఞతకె వదిలేస్తున్నాం అని అన్నారు.
పసుపు బోర్డు అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని కేంద్ర ప్రభుత్వం ఏదైనా కొత్తగా సంస్థను ప్రారంభించాలి అంటే కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందాలి అని పార్లమెంట్ లో బిల్లు రూపాంలో ఆమోదం పొందాలి అని అన్నారు, కాని ఇటీవల జరిగిన కేంద్ర మంత్రి వర్గం సమావేశంలో పసుపు బోర్డుకు సంబందించి ఎటువంటి నిర్ణయం జరుగలేదు అని అన్నారు, ఇంతకు ముందు పార్లమెంట్ లో కామర్స్ శాఖ మంత్రి కొత్త బోర్డులు మేం ఏర్పాటు చేయం అని అన్నారు అని గుర్తు చేశారు.
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అరవింద్ మరియు బిజెపి పార్టీ ఉనికి కోల్పోవటంతొ రాజకీయ ఉనికి కోసం మళ్ళీ పసుపు బోర్డు పేరు మీద రైతులను మరొక్కసారి మోసం చేయటానికి చూస్తున్నారు అని కేవలం మీడియాలో హెడ్ లైన్ మేనేజ్మెంట్ చేస్తున్నాడు అని అన్నారు, రైతులు అప్రమత్తంగా ఉండాలి అని రానున్న ఎన్నికల్లో బీజేపీ ని అరవింద్ రాజకీయంగా సమాధి చేయాలనీ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం పసుపు కు 12000 మద్దత్తు ధర మరియు పసుపు బోర్డు ఏర్పాటు చేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మందుల పోశెట్టి, బట్టు శంకర్, మీసాల రవి, హబీబ్, బాల కిషన్, పాషా, అఖిల్, అబ్దుల్ వాసి, ముస్తాక్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.