నిజామాబాద్ A9 న్యూస్:
సోమవారం నిర్వహించబోయే ఆర్మూర్ మున్సిపాలిటీ సాధారణ సమావేశం అవినీతి అక్రమాలతో కూడిన 18 అంశాలతో ప్రధానంగా మొక్కల పేరున “గ్రీన్ బడ్జెట్” పేరు పెట్టి మరో అవినీతికి తెర లేపడానికి ప్రయత్నం చేస్తున్న అవినీతి అక్రమాల కు వ్యతిరేకంగా ఆదివారం భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు ద్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎమ్మెల్యే అందుబాటులో లేని కారణంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సిబ్బందికి, మున్సిపాలిటీ సాధారణ సమావేశంలో ప్రవేశపెట్టే తీర్మాన కాపీతో పాటు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆర్మూర్ మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ జీవి నరసింహ రెడ్డి, బిజెపి నిజామాబాద్ జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు రెడ్డి మాట్లాడుతూ…..
రేపు నిర్వహించబోయే మున్సిపాలిటీ సాధారణ సమావేశంలో 18 అంశాలతో కూడినటువంటి ఎజెండాను పెట్టబోతున్నారని. ప్రధానంగా మొక్కల పేరున పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు, స్కాముకు తెర లేపడం జరుగుతుందని. ఈ యొక్క స్కాముకు గ్రీన్ బడ్జెట్ అనే పేరు పెట్టి దాదాపు 25 లక్షల రూపాయల స్కామ్ జరగబోతుందని. మొన్నటికి మొన్న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ మార్కెట్ కమిటీ లో ఉన్నటువంటి 3వేల మొక్కలు విషయం అడగడంతో ఆ మొక్కలను డంపింగ్ యార్డ్ లో పడేసి మొక్కలు నాటినట్లుగా వాటిపై కూడా డబ్బులు తీసుకోవడం జరుగుతాఉందని.
అంతేకాకుండా ఆర్మూర్లో కుక్కల బెడద, పందుల బెడద, దోమల బెడద, చివరికి కోతులు బెడద తీవ్రమైపోయినప్పటికిని అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి రోడ్లు భయానకంగా మారి ఆ రోడ్లలో నడిచినా, ప్రయాణం చేసినా ఆస్పత్రి పాలు కావడం గ్యారెంటీగా మున్సిపాలిటీ పని చేస్తా ఉందని. ఇలాంటి విషయంలో చొరవ తీసుకోవాల్సిన మున్సిపాలిటీ అవినీతి అక్రమాలకు, భూకబ్జాలకు తప్ప అభివృద్ధికి నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆర్మూర్ మున్సిపాలిటీ ఉందని.
జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ సంబరాలకు తీసుకొచ్చినటువంటి మిఠాయిలకు సైతం అవినీతికి పాల్పడుతూ ఆ మిఠాయి సైతం 33 వేల రూపాయల ఖర్చు అయినట్లుగా దొంగ లెక్కలు రాయడం జూన్ 2 యొక్క సందర్భాన్ని అవమానపరిచినట్లుగానే భారతీయ జనతా పార్టీ భావిస్తావుందని. అంతేకాకుండా మిషన్ భగీరథ పేరున ప్రజలకు ఉచితంగా ఇస్తామని చెప్పినటువంటి ఈ నీళ్లను ప్రతి నెల 100 రూపాయలు చొప్పున ప్రజలకు తెలియకుండానే తీసుకొని అవినీతికి పాల్పడతా ఉన్నారని.
అంతేకాకుండా ఆర్మూర్ మున్సిపాలిటీలో బోర్లు చెడిపోతున్నాయని చెప్పి రిపేర్ ల పేరుతో ప్రతి బడ్జెట్లో పది లక్షల పైన బిల్లులు పెట్టడం జరుగుతా ఉందని. అదేవిధంగా రోడ్ల లో మొర్రం వేస్తున్నామని చెప్పి మొర్రం వెయ్యకుండానే లక్షల రూపాయలు వెచ్చిస్తున్నట్లుగా రికార్డులలో దొంగలెక్కలు చూపిస్తున్నారని. ఎటువంటి కమిటీలు లేకుండా, ప్రతిపక్షాలతో చర్చించకుండానే ఇస్టారీతీన వ్యవహరిస్తున్నారని. అవినీతికి పాల్పడడం, అక్రమాలకు పాల్పడడం, దొంగ లెక్కలు సమర్పించడంలో ఆరితేరిపోయినటువంటి మున్సిపాలిటీ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని, దీంట్లో భాగస్వామి అయిన మున్సిపాలిటీ చైర్మన్ రాజీనామా చేయాలని, అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయ్ సహకరిస్తున్నటువంటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ప్రజలు తరిమివేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ.
టీఎస్ బి పాస్ యాక్ట్ ప్రకారం ఏదైనా పని చేసిన కమిటీలు వేసి ఆ కమిటీల ద్వారానే ఆర్మూర్ అభివృద్ధికి పాల్పడాలని. అలాంటిదేమీ లేకుండానే ఇస్టారీతీన వ్యవహరించడం (జిస్కే హత్ మే లాఠీ – ఉస్ కా బైస్) ఎవరి చేతిలో కట్టె ఉందో వారిదే బర్రె అనే నానుడి గా బిఆర్ఎస్ నాయకుల వ్యవహారం ఉందని. ఆర్మూర్ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై కలెక్టర్ కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కలెక్టర్ సైతం నిస్తేజమైన అచేతన స్థితికి చేరుకున్నారని.
ఇలాంటి దౌర్భాగమైన పరిస్థితి ఉండడం మన ఆర్మూర్ మున్సిపాలిటీ ప్రజలు చేసుకున్న దురదృష్టమని. ప్రజలు ఈ విషయాలన్నీ గమనించి రాబోయే కాలంలో ఈ అవినీతి, అక్రమాలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులను ప్రజాప్రతిథులను ఓటు అనే ఆయుధంతో తరిమి తరిమి పంపించెయ్యాలని ఈ సందర్భంగా తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో బిజెపి మరియు వివిధ మోర్చాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.