Monday, November 25, 2024

100% రాయితీపై చేప పిల్లలు విడుదల

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

మోపాల్ మండలంలోని న్యాల్ కల్ గ్రామములోని మాసాని చెరువు నందు 2016-17 సంవత్సరము నుండి 100% రాయితీపై చేప పిల్లలు విడుదల రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, మత్య్స, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, గౌరవ ఎమ్మెల్సీ శ్రీ కల్వకుంట్ల కవితమ్మ గార్లతో కలిసి రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఈ సంవత్సరము 2.74 లక్షల చేప పిల్లలు మరియు 1.37 లక్షల రొయ్య పిల్లల విడుదల చేశారు.

నిజామాబాద్ అర్బన్ మండలములోని అర్సపల్లి గ్రామములోగల ప్రభుత్వ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం నందు రూ.2.00 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హోల్ సెల్ మరియు రిటైల్ చేపల మార్కెట్ కు శంఖు స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రజల కోసం మీకోసం పోరాటం చేసే నాయకుడు గోవర్ధన్ అన్నగారు అంటే మన కష్టసుఖాల్లో భాగస్వామ్యం చేసుకొని మన అవసరాలు దృష్టిలో ఉంచుకొని తీర్చే వాళ్లే నాయకులు అనునిత్యం ప్రజలకు ఏదో చేయాలని ఆలోచించే వ్యక్తి బాజిరెడ్డి గోవర్ధన్ గారు అని కొనియాడిన మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

నేడు డిచ్ పల్లి మండల కేంద్రంలో నడిపల్లి గ్రామంలో నిర్మించబోతున్న చేపల మార్కెట్ నిర్మాణమునకు భవనానికి శంకుస్థాపన చేశారు అనంతరం మోపాల్ మండలంలోని న్యాల్ కల్ గ్రామములోని మాసాని చెరువు నందు 2.74 లక్షల చేప పిల్లలు మరియు 1.37 లక్షల రొయ్య పిల్లల విడుదల చేశారు. అనంతరం మత్స్యకారుల సభ్యత్వ గుర్తింపు కార్డు పంపిణీ చేశారు.నిజామాబాద్ అర్బన్ మండలములోని అర్సపల్లి గ్రామములోగల ప్రభుత్వ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం నందు రూ.2.00 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హోల్ సెల్ మరియు రిటైల్ చేపల మార్కెట్ కు శంఖు స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు మాట్లాడుతూ… తెలంగాణ రాకున్నా ముందు, చెరువులన్నీ కబ్జాలకు గురయ్యాయి,మత్స్య పారిశ్రామిక కార్మికులు చాపలు పట్టుకుందామంటే చెరువు లేకుండా ఉండేవి, కానీ ఇప్పుడు తెలంగాణ వస్తే ఏం వస్తది..చెరువులు కుంటలు మిషన్ కాకతీయ ద్వారా చెరువులను మరమ్మత్తులు చేసి ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది, దీని ద్వారా ప్రతి ఒక్క మత్స్యకారుడు లబ్ధి పొందుతున్నాడు సీఎం కెసిఆర్ ఘనత వల్లే ఇదంతా జరిగింది అని ఆయన గుర్తు చేశారు.ఇట్టి నీటి వనరులలో 2023-24 సంవత్సరమునకు గాను 1.71 లక్షల 35-40 mm సైజు గల చేప పిల్లలు విడుదల చేయుటకు ప్రతిపాదించనైనది ఆయన వివరించారు.పరిధిలో రిజిస్టర్ కాబడి యున్న సభ్యులకు వారి చెరువులలో ఉత్పత్తి అయిన చేపలను మార్కెటింగ్ చేసుకొనుటకు సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా 20 ద్విచక్ర వాహనాలు 01 లగెజ్ ఆటో రూ. 11.55 లక్షల వ్యయముతో 75 శాతం రాయితీపై పంపిణీ చేయడము జరిగిందని అని గుర్తు చేశారు.

కులవృత్తులను ప్రోత్సహించడానికి చాలా కార్యక్రమాలు తీసుకున్నాం దీంట్లో ప్రధానమైనది మత్స్యకారులు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఉన్నారు వాళ్లకు 100 శాతం సబ్సిడీ మీద చేప పిల్లలు పంపిణీ చేయడం జరుగుతుంది, ఈ సంపద పెరుగుతుంది ఆ సంపద పెరగడమే కాకుండా మంచి లాభాలు రావాలంటే మంచి మార్కెట్లు ఉండాలి ఎందుకంటే చెరువు దగ్గర కొనాలంటే కొంత ఇబ్బంది అయితది. మీరు కూడా టీవీఎస్ బండ్ల మీదను సైకిల్ మీదను మోటార్ సైకిల్ మీద ఎక్కడా అమ్మాలంటే కూడా ఇబ్బంది అయితది అదే ప్రభుత్వం నిర్మిస్తున్న చేపల మార్కెట్లో మన అమ్మడం అంటే కొనేవాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ ఉద్దేశంతోనే మార్కెట్లు నిర్మించుకోవడం జరుగుతుందని ఆయన గుర్తు చేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర పశు సంవర్ధక శాఖ, మత్య్స, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ గారు, ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితమ్మ గారు, అర్బన్ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా గారు, జిల్లా కలెక్టర్ హనుమంతు గారు, నగర మేయర్ నీతు కిరణ్ గారు, జిల్లా యువ నాయకులు జిల్లా పరిషత్ ధర్పల్లి జెడ్పిటిసి జిల్లా ఒలంపిక్ ఉపాధ్యక్షులు శ్రీ బాజిరెడ్డి జగన్మోహన్ గారు , నూడా చైర్మన్ సంజీవరెడ్డి గారు,ఉమ్మడి జిల్లాలో డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్ గారు,మత్య్స, పాడి పరిశ్రమల ఐఏఎస్ ఆఫీసర్స్, ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ మండలాలకు చెందిన జడ్పిటిసిలు, ఎంపీపీలు, వైసీపీలు, సర్పంచులు, ఉప సర్పంచ్లు, పార్టీ మండల అధ్యక్షులు, సొసైటీ చైర్మన్లు, సొసైటీ డైరెక్టర్లు, మండల ముఖ్య నాయకులు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Website | + posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here