Monday, November 25, 2024

7 అగ్రకుల పార్టీల పై “ధర్మ సమాజ్ పార్టీ -ధర్నా”

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

నందిపేట్ మండల కేంద్రంలో భారీ ఎత్తున బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ పార్టీల దిష్టిబొమ్మల దహనం.ధర్నా.

నిజామాబాదు జిల్లా, నందిపేట్ మండలం, సెప్టెంబర్ 14 a9న్యూస్.

93% ప్రజలు బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉండగా 7 శాతం లేని అగ్రకులాలు BRS, BJP, CONGRESS,TJS, CPI,CPM, YSRCP పార్టీలకు నాయకత్వం వహించడమేమిటి ? ఇది పూర్తిగా సామాజిక న్యాయ సూత్రానికి, భారత రాజ్యాంగ సమానత్వ – భావనకి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. అందుకే ఈ 7 అగ్రకుల పార్టీల వైఖరిని ‘ధర్మ సమాజ్ పార్టీ’ తీవ్రంగా నిరసిస్తుంది. 7 అగ్రకుల పార్టీల ముందు ధర్మసమాజ్ పార్టీ, 7 డిమాండ్లతో 15-08-2023న వారికి లేఖలు రాయడంతో పాటు బహిరంగ ప్రకటన చేసి 15 రోజుల గడువు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన గడువు ముగిసింది కానీ ఇంత వరకు ఈ అగ్రకుల పార్టీల నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పార్టీల తీరుకు నిరసనగా “ధర్మ సమాజ్ “పార్టీ అన్ని జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, మండల | ఆధ్వర్యంలో ఈ ఏడు పార్టీల వైఖరిని నిరసిస్తూ రేపటి నుండి భారీ పోరాటానికి సిద్ధమైంది. కేంద్రాల్లో భారీ ధర్నాలకు, పార్టీల దిష్టిబొమ్మల దహనానికి పిలుపునివ్వడం జరిగింది. ” ఈ రోజు జిల్లా కేంద్రంలో ఈ ఏడు అగ్రవర్ణ పార్టీల వైఖరికి నిరసనగా BC/SC/ST ప్రజలు & అన్ని సామాజిక ప్రజా సంఘాల | నాయకులతో ధర్మ సమాజ్ పార్టీ కలిసి నల్ల వ్యాడ్జీలు ధరించి భారీ ధర్నా కార్యక్రమాలు రోడ్లపై బైకాయించి రాస్తారోకోలు నిర్వహించడం జరిగింది.

“ఈ నెల 12న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా, రాస్తారోకోలు. ” ఈ నెల 13 న అన్ని మండల కేంద్రాల్లో ధర్నా, రాస్తారోకోలు, ” 90% BC/SC/STలకు ద్రోహం చేస్తూ, సామాజిక అన్యాయం చేస్తున్న BRS, BJP, CONGRESSల దుష్ట రాజకీయాలను ఎండగడతాం.

నిరసన ధర్నాలు, దిష్టిబొమ్మల దహనమే కాకుండా, ఈ పార్టీలన్నింటినీ ప్రజల్లో తిరగనివ్వం ఈ ఏదు పార్టీలు బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు నాయకత్వం ఇచ్చే సామాజిక న్యాయం వైపా బీసీ ఎస్సీ ఎస్టీలకు నాయకత్వం ఇవ్వకుండా అగ్రకుల ఆధిపత్యం కొనసాగించే సామాజిక అన్యాయం వైపా తేల్చుకోవాలి. ఇప్పటికైనా ఈ అగ్రకుల BRS, BJP, CONGRESS, TJS, CPI, CPM, YSRTP పార్టీల్లు పునరాలోచించుకొని ఏడు శాతం లేని ఈఆగ్రకులాలు వారి పార్టీల అధినాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో 93 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు అప్పగించాలని డిమాండ్.

7 రాజకీయ పార్టీల ముందు.. (BRS, BJP, CONGRESS TJS, CPI, CPM, YSRTP)

7 డిమాండ్స్:

1. మీ మీ పార్టీలలో అధి నాయకత్వాన్ని బీసీలకు కేటాయించండి. గ్రామస్థాయి వరకు సంస్థాగత నిర్మాణంలో మీ పార్టీని 90 శాతం BRS ప్రభుత్వం తో పాటు, అధికారం లోకి వస్తాం అని అంటున్న BJP, కాంగ్రెస్అణగారిన కులాలకునాయకత్వం అప్పాజెప్పండి.

2. మీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్థానాన్ని దళితుడికి కేటాయించండి తదితర పార్టీలు ఈ క్రింది డిమాండ్స్ ని అమలు చేస్తామని ప్రకటించండి .

3. క్యాబినెట్ అంతా 93% అణగారిన బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు కేటాయించండి. బడ్జెట్లో 90 శాతం అణగారిన కులాలకే కేటాయించండి,

4. మీ ప్రభుత్వం ప్రవేశపెట్టే 5. రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ, డీజీపీ నుండి రాష్ట్ర బ్యూరోక్రసీ ఉన్నతాధికారులందర్నీ బీసీ, ఎస్సీ, ఎస్టీ అధికారులతో నింపండి.

6. మీ మీ పార్టీలు ఇచ్చే ఎమ్మెల్యే, ఎంపీ, స్థానిక సంస్థలలో టికెట్స్ మొత్తంలో 93% బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించండి.

7. మా పార్టీలలో అగ్రకుల ఆధిపత్యం లేదు, సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నామనే బోర్డు పెట్టండి. ఈ డిమాండ్ న్ను మీరు అమలు చేయకపోతే, 10 శాతం లోపు ఉన్న రాజకీయ పార్టీల ‘ సామాజిక ద్రోహాన్ని’ ప్రజల ముందు ఎండగట్టి’ దోషి గా నిలబెడతాం.
పాతుకుపోయిన ఈ అగ్రకుల పార్టీల నాయకత్వాన్ని సోషల్ క్రిమినల్స్ సోషల్ టెర్రరిస్ట్ లు గా నిలబెడతాం అని నిరసన వ్యక్తం చేస్తున్న “ధర్మ సమాజ్ పార్టీ “జిల్లా అధ్యక్షులు సుమన్, జిల్లా నాయకులు ప్రేమ్ కుమార్,మహిపాల్ ,మండల అధ్యక్షులు శ్రీకాంత్,మండల ప్రచార కమిటీ సభ్యులు భూమేష్, సాగర్, బద్రి,నరేష్ అజయ్ సాయికుమార్,లవణ్ మనోజ్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here