అర్హులైన లబ్ధిదారులకు దళిత, బిసి, మైనార్టీ బందులను అందించాలి
టీజేఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ సర్దార్ వినోద్ కుమార్
అర్హులైన లబ్ధిదారులకు దళిత బందు, బీసీ బందు, మైనారిటీ బందులను అందించాలని తెలంగాణ జన సమితి నియోజకవర్గ ఇన్చార్జ్ సర్దార్ వినోద్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రమైన ముధోల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దళిత బందు-బీసీ బందు -మైనారిటీ బందులను కార్యకర్తల బంధుగా మార్చిందని ఆరోపించారు. అర్హులైన పేదలకు అన్ని బందులను అందించి ఆదుకోవాలని అన్నారు. ప్రభుత్వంBRS కార్యకర్తలకు మాత్రమే బందులను అందించడం తగదన్నారు. దళిత బందు, బీసీ బందు, మైనారిటీ బందులపై ప్రభుత్వం వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా టీజేఎస్ ముధోల్ మండల అధ్యక్షుడిగా షేక్ మీనాజ్, మండల గిరిజన విభాగం అధ్యక్షుడిగా రాథోడ్ శ్రీనివాస్ నాయక్ కు నియామక పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో విజేఎస్ రాష్ట్ర కార్యదర్శి పల్లపు తులసిరామ్, టీజేఎస్ నాయకులు, అశోక్, పాషా, నరేష్ తదితరులు పాల్గొన్నారు.