నిజామాబాద్ A9 న్యూస్:
బాల్కొండ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వేముల ప్రశాంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మొదటి రోజు బాల్కొండ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు బాల్కొండలో చేసిన అభివృద్ధి పనులు ఓటర్లకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి వేముల ప్రశాంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపంచాలని కోరారు. ఎంపీపీ లావణ్య లింగాగౌడ్, బిఆర్ఎస్ నాయకులు అన్నారు.
ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యా సాగర్, ఎస్సి విభాగం మండల అధ్యక్షుడు ద్యావతి మురళీ (రాజు), ఎస్సి విభాగం గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్ల దయాకర్, 14వ వార్డు సభ్యురాలు పుప్పాల లావణ్య, నాయకులు నల్ల తిరుపతి, బోడ లింగన్న, మోతె మహేష్, పుప్పాల రాజేశ్వర్, ద్యావతి భూలక్ష్మీ, బేగరి శోభ, పిట్ల జ్యోష్ణ, ద్యావతి దీప, వేంపల్లి గంగు, ద్యావతి సువర్ణ, పిట్ల మాన్విక, పథాని సరితా, బేగరి గంగమని తదితరులు పాల్గొన్నారు.