బోధన్:: ఎడపల్లి:: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని శాంతియుతంగా నిరసన దీక్ష చేపట్టిన దానిని జీవించుకోలేక ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయించిందని నిరసిస్తూ గురువారం ఎడపల్లి మండలం సాదాపూర్ గేటు వద్ద భాజపా శ్రేణులు రాస్తారోకో నిర్వహించాయి. రాస్తారోకోతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వడ్డీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ… ప్రతిపక్షాలపై ప్రభుత్వం దాస్టికాలకు పాల్పడుతోందని, ప్రశ్నించే గొంతులో నొక్కి పెడుతోందని అన్నారు. ముందుగా అనుమతి తీసుకుని కిషన్ రెడ్డి రిలే నిరాహార దీక్ష చేపడితే దీక్షా శిబిరాన్ని కూల్చివేసి అక్రమంగా అరెస్టు చేయడం తగదన్నారు. వచ్చే ఎన్నికల్లో భాజపా గెలుపు ఖాయమని, ప్రభుత్వ నిర్బంధ వైఖరిని నిరసిస్తూ ప్రజలు నిరసనలు తెలపాలని మోహన్ రెడ్డి సూచించారు. ఆందోళనలో మండల భాజపా అధ్యక్షుడు కోల ఇంద్రకరణ్, నాయకులు మల్లెపూల శ్రీనివాస్, గంగాధర్, సాయిలు, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.