నిజామాబాద్ A9 న్యూస్:
నందిపేట్ మండలం రైతుఫారం గ్రామం యువకులను గణపతి అన్నదానానికి బియ్యం ఇస్తామని పిలిచి బలవంతంగా కండువాలు వేసి, బిజెపి పార్టీలో జాయిన్ చేయడంతో , ఇది నచ్చని ఆ యువకులంతా వచ్చి నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు మచ్చర్లసాగర్ గారి ఆధ్వర్యంలో తిరిగి భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరడం జరిగింది. ఈ విషయాన్ని మీడియా ముఖంగా యువకులంతా వారిని బలవంతంగా చేర్చిన విధానాన్ని వివరించి, రైతు ఫారం గ్రామమంతా ఏకగ్రీవంగా జీవన్ అన్నకు మద్దతు ఇస్తామని తెలపడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ మాట్లాడుతూ అభివృద్ధి చేసి ఆకర్షించాలి తప్ప అబద్ధపు మాటలతో ఆకర్షణ రాజకీయాల్లో పనికిరాదని, ఇష్టపూర్వకంగా పార్టీలో చేర్చుకోవాలని బలవంతంగా చేర్చుకోవద్దని హితవు పలికారు. రైతు ఫారం యువకులు వెంకటేష్, శ్రీకాంత్, భాను ప్రసాద్, రితీష్, మహేష్, సాయి, ధనరాజ్, ప్రవీణ్, వినయ్, ఉదయ్, పవన్, తిలక్, భారతీయ జనతా పార్టీ నుండి తిరిగి భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు ఫారం గ్రామ నాయకులు కృష్ణ, రసూల్, నరేష్, తిలక్ నందిపేట్ మండల యూత్ నాయకులు ఉమ్మడ అశోక్, దర్వాడి అశోక్, గంధం రాజశేఖర్, మంతెన శ్రీకాంత్, వెంకటేష్, వేణు, విగ్నేష్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.