కెనడా ప్రధాని ట్రూడోకు.. ఐఏఎఫ్ వన్ ఆఫర్ ఇచ్చింది భారత్. వైమానిక దళానికి చెందిన ఐఏఎఫ్ వన్ విమానంలో ట్రూడోను పంపించాలని భారత్ ప్రయత్నించినట్లు తెలిసింది. జీ20 సమావేశాలకు వచ్చిన ట్రూడో విమానంలో సాంకేతిక లోపం రావడంతో.. ఆయన రెండు రోజులు ఆలస్యంగా స్వదేశానికి వెళ్లారు.
న్యూఢిల్లీ: జీ20 సమావేశాలకు హాజరైన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం వల్ల అదనంగా మరో రెండు రోజులు ఇక్కడే గడిపిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం ఆయన తిరుగు ప్రయాణం అయ్యారు. గత శుక్రవారం వచ్చిన ట్రూడో .. ఆదివారం వెళ్లాల్సి ఉంది. కానీ విమానంలో సమస్య రావడం వల్ల ఆయన ఢిల్లీలో ఉండిపోయారు. అయితే బ్యాకప్ ప్లేన్ కోసం కెనడా ఎదురుచూసింది. ఆ విమానాన్ని అకస్మాత్తుగా లండన్‌కు తరలించారు. ఇక వచ్చిన విమానాన్ని రిపేర్ చేశారు. దాంట్లోనే ఆయన మంగళవారం తిరుగు ప్రయాణం అయ్యారు.
నిజానికి ట్రూడోను సురక్షితంగా స్వదేశానికి పంపేందుకు భారత్ ప్రయత్నించింది. భారత వైమానిక దళానికి చెందిన ఐఏఎఫ్ వన్(IAF One) విమానంలో ట్రూడోను స్వంత దేశానికి పంపేందుకు భారత్ ప్రయ్నతించినట్లు ఓ రిపోర్టు ద్వారా వెల్లడైంది. కానీ భారత్ ఇచ్చిన ఆఫర్‌ను ట్రూడో తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఐఏఎఫ్ వన్ ఆఫర్‌ను కాదు అని, ఆయన బ్యాకప్ ప్లేన్ కోసం ఎదురుచూశారు. కానీ చిట్టచివరకు వచ్చిన విమానాన్నే రిపేర్ చేసి వెనక్కి వెళ్లారు. భారత రాష్ట్రపతి, భారత ఉప రాష్ట్రపతి, భారత ప్రధాని ట్రావెల్ చేసేందుకు ఐఏఎఫ్ వన్‌ను వినియోగిస్తారు.