A9 న్యూస్:
సెప్టెంబర్7 వ తేదీ వరకు ప్రయాణాలుంటే వాయిదా వేసుకోండి. అర్జెంట్ పనులేమైనా ఉంటే వెంటనే కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు తడిసిపోనున్నాయి.
ఉరుములు, మెరుపులు, పిడుగులతో వణికిపోనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురవనున్నాయి. పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ.సెప్టెంబర్ 7 వ తేదీవరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలు పడటంతో పాటుగా పిడుగులు కూడా పడే అవకాశం ఉంది అని చెప్పింది.
ఐఎండీ … వివరాల ప్రకారం..
సెప్టెంబర్ 7 వ తేదీవరకు తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఏపీకి సమీపంలో పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి5.8కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. సెప్టెంబర్ 4వ తేదీ వరకు వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం వైపు దిగువస్థాయిలో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆవర్తనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు, భారీ వర్షాలు కొన్ని చోట్ల పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోనూఅక్కడక్కడ తేలికపాటి నుండి భారీ అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో గాలులు బలంగా వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల బలమైన గాలులు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి.