A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:
ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని గంగా ఆసుపత్రి అధినేత డాక్టర్ అమృతరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గ పాత్రికేయులకు ఆదివారం రోజు ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు డాక్టర్ అమృత రామ్ రెడ్డి, డాక్టర్ భైరవనాధ్, డాక్టర్ గౌతమ్ రెడ్డి, డాక్టర్ చంద్రమోహన్, డాక్టర్ వంశీకృష్ణ,లు పాత్రికేయులకు ఈసీజీ, కార్డియాక్ టెస్టులను నిర్వహించారు. జనరల్ ఫిజీషియన్ ద్వారా మూడు వారల క్రితం నిర్వహించిన రక్త పరీక్షల రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించి తగిన సూచనలను సలహాలను అందజేశారు. అనంతరం గంగా ఆసుపత్రి అధినేత డాక్టర్ అమృతం రెడ్డి మాట్లాడుతూ, ఆర్మూర్ జర్నలిస్టు మిత్రులకు గత మూడు వారాల క్రితం రక్త పరీక్షలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పరీక్షలలో కిడ్నీ ఫంక్షన్, లివర్ ఫంక్షన్, కార్డియాక్ రిస్క్ మార్క్స్ టెస్ట్ రకమైన పరీక్షలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈరోజు కార్డియాలజిస్టులు, ఫిజీషియన్ల, ద్వారా అవి క్షుణ్ణంగా పరిశీలించి తగిన సూచనలను, సలహాలను ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ మధ్య మనం కొన్ని సంఘటనలను గమనిస్తే నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉండి సడన్ డేత్స్ అవుతున్నాయి. చాలామందికి అవి ఎలాంటి ప్రాబ్లం వల్ల జరుగుతున్నాయో తెలియకపోవడం జరుగుతుంది. అవి ఎందుకు జరుగుతుందో ముందే తెలియపరచుకున్నట్లైతే ముందే జాగ్రత్త పడి మనం కొన్ని లైఫ్ లను సేవ్ చేసిన వాళ్ళము అవుతామన్నారు. ముఖ్యంగా మన జర్నలిస్టు మిత్రులకు ఈ పరీక్షలను ఎందుకు పెట్టమంటే వీరికి రిస్క్ గ్రూప్ ఎక్కువ ఎందుకంటే ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సరిగ్గా నిద్రఉండదు, ఆహారపు అలవాట్లు సమయానికి తినలేకపోవడం కావున ఈరోజు మన జర్నలిస్టు మిత్రుల కొరకు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని, ఈ ఆరోగ్య పరీక్షలు వీరితోనే మొట్టమొదటిగా నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలను మును ముందు నిర్వహిస్తామని తెలియజేశారు. అనంతరం స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ ప్రెస్ భవన్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్లను శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రెస్ భవన నిర్వహణ కమిటీ సభ్యులు సురేందర్ గౌడ్, పింజ సుదర్శన్, రాజేందర్, సాయి ప్రణీత్, షికారి శ్రీనివాస్, గోలి పురుషోత్తం, సీనియర్ పాత్రికేయ మిత్రులు రాజేశ్వర్ గౌడ్, పుట్టి మురళి, ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నెమలి ప్రశాంత్, నవనాధాపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నరేందర్, టి యు డబ్ల్యూ జే జిల్లా ఉపాధ్యక్షుడు పార్దేం సంజీవ్, పాత్రికేయ మిత్రులు అజీమ్, మహేష్, రాజేష్, సందీప్, దినేష్, రితేష్, రాకేష్, తిరుపతి, అశోక్, చరణ్ గౌడ్, కిరణ్, గణేష్, వినోద్, విన్సెంట్, జిపి సంతోష్, చిరంజీవి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.