*ఆత్మీయత అనుబంధాలకు ప్రతిరూపం స్నేహబంధం*
నిజామాబాద్,ఆగస్ట్ 04 సదాశివ్ A9 న్యూస్ (ప్రతినిధి)బాల్కొండ నియోజకవర్గం
కష్ట సమయంలో కలత చెందిన మనసుకి ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహమని, అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహమని, ఆత్మీయత, అనుబంధాలకు ప్రతిరూపం స్నేహబంధమని లోలపు ఆనంద్ అన్నారు . ప్రతి సంవంత్సరం ఆగష్టు మాసం మొదటి ఆదివారం జరుపుకునే స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని భీమ్ గల్ మండలం బాబాపూర్ . ముదిరాజ్ వాడాలో . ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి మిత్రులందరూ ఓకే చోట కలిసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు . ఈ సందర్భంగా నృష్టిలో స్వచ్చమయిన స్నేహన్ని మించినది ఏదీ లేదని, స్నేహానికి కులం,మతం, జాతి అనే తారతమ్యం ఉండదని, ఇది సాంస్కృతిక మరియు సామాజిక భేదాలకు అతీతంగా, సామాజిక సామరస్యాన్ని మరియు అవగాహనను పెంపొందించే బంధంగా, విభేదాలను తగ్గించడంలో మరియు పరస్పర గౌరవాన్ని ప్రోత్సహించడంలో స్నేహబంధం ముఖ్య పాత్ర పోషిస్తుందని ముదిరాజ్ ఫ్రెండ్స్ అన్నారు .ఏ బంధం లేకున్నా స్నేహమనే బంధంతో ముడిపడి పరిణతి చెందుతూ కాలక్రమేణా బలమైన బంధంగా మారి అన్నింటికి చేయుతనిచ్చేదే నిజమైన స్నేహ బంధమన్నారు. వ్యక్తిగత జీవితంలో ఎదుగుదలకు వ్యక్తిగత నిర్మాణానికి మరియు మానవీయ విలువలు పెంపొందింపచేయడంలో స్నేహితుల పాత్ర ప్రధానమైనదన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సభ్యులు డిచిపల్లి తుకారం, కొప్పుల ధర్మేందర్, లోలపు లింబాద్రి, డిచ్ పల్లి రవి, జంగిటి దశరథ్, జేకే గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.