*జో అచ్చుతానంద జోజో ముకుంద…
*లాలీ పరమానంద రామ గోవిందా జో జో…
*లాలీ పరమ నంద లాలీ గోవిందా లాలీ…!
*లాలీ లింబాగీరీష లాలీ జగదీషా లాలీ…!
*తోలుత భ్రమ్మాండం తోట్లే గావించి నాలుగు వేదాముల గొలుసు లామరించి లాలీ…!!
*కమనీయము.. నరసింహుని డోలారోహణం…
సదాశివ్ A9 న్యూస్ ప్రతి నిధి బాల్కొండ నియోజకవర్గం:
జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన నింబాచల క్షేత్రం పై జరుగుతున్న శ్రీ వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు కమల పుష్కరిణి మండపంపై స్వామి వారికి డోల సేవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం ఉత్సవ ప్రారంభంలో ఆహ్వానీతులైన సకల దేవతలకు ఉద్వాసన చేశారు. ధ్వజ అవరోహణము చేసి ఉద్వాసన బలి ప్రధానమోనారించారు. అనంతరం కమల పుష్కరిణిపై గల మండపానికి శ్రీ లక్మీ నృసింహుల ఉత్సవ మూర్తులను పల్లకిలో తెచ్చారు. సమస్త భక్తజనం భక్తి శ్రద్దలతో వీక్షిస్తుండగా లాలీ పాటలు పాడుతూ డోలసేవ నిర్వహించారు. డోలసేవ తో కొండపై జరుగుతున్న బ్రహ్మోత్సవాలను ముగింపు అయ్యింది.
*గ్రామాలయానికి ఉత్సవ విగ్రహాలు…
సాయంత్రం శ్రీ లక్మీ నృసింహుని ఉత్సవ విగ్రహాలు శ్రీ వారి కొండ నుండిబయలు దేరి రాత్రికి భీంగల్ చేరుకున్నాయి. గుర్రపు సేవపై స్వామిని అలంకరించి ఎంతో ఘనమైన డప్పులు, భాజ భజంత్రిలతో శ్రీ లక్మీ నృసింహుని గ్రామాలయమునకు ఎదుర్కొన్నారు. స్వామి గ్రామాలయానికి చేరుకున్న పిమ్మట సప్తావరుణ పూజ నిర్వహించారు. పూజ ముగిసిన పిమ్మట దివ్యమైన మహోత్సవ క్రతువును భగవంతుడైన శ్రీ లక్మీ నృసింహునికి జలాక్షతలతో సమర్పించారు. ఈ కార్యక్రమం తో ఉత్సవాలు సమాప్తం అయ్యాయి.