A9 న్యూస్ ప్రతినిధి ఆర్మూర్:

ఆర్మూర్ పట్టణంలో నీ జర్నలిస్ట్ కాలనీలో 56వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీ అధ్యక్షులు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ కాలనీ పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకుందామని తెలిపారు పరిశుద్ధ పరిశుభ్రతపై కాలనీవాసులకు అవగాహన కల్పిస్తున్నామని చెత్తాచెదారం ను మున్సిపాలిటీ బండిలోనే వేసి శుభ్రంగా పరిసరాలను ఉంచుకోవాలని సూచించరు చెత్తాచెదారం పై మహిళలకు అవగాహన కల్పించినాము. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ ఆధ్వర్యంలో అభివృద్ధి కమిటీ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాక్టర్తో రోడ్లో ఉన్న గుంతలను గూర్చారు. రోడ్డుకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. రోడ్డుపై పేరుకుపోయిన చెత్తాచెదారంతో నిండిన కుప్పలను సుప్రపరిచి రోడ్లపై వర్షం పడితే నీరు నిలువ లేకుండా చేశారు. మురికి కాల్వలను శుభ్రపరిచరు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు శివరాజ్ కుమార్, కమిటీ ప్రతినిధులు కొక్కెర భూమన్న, గడ్డం శంకర్, ఎల్ టి కుమార్, కాంతం రాజు, సాయన్న, ఎర్ర భూమయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *