Monday, November 25, 2024

IND vs PAK | ఆసియా కప్‌లో ఫైనల్‌కు చేరిన భారత్‌.. అలా జరిగితే తుదిపోరులో పాకిస్థాన్‌తో తలపడే ఛాన్స్‌!

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

IND vs PAK | బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై భారత్‌ విజృంభించింది. వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుచేసిన రోహిత్‌సేన.. సూపర్‌-4లో భాగంగా రెండో మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో లంకను మట్టికరిపించింది. దీంతో 4 పాయింట్లు ఖాతాలో వేసుకున్న టీమ్‌ఇండియా ఆసియాకప్‌ ఫైనల్‌కు చేరగా.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన బంగ్లాదేశ్‌ అధికారికంగా రేసు నుంచి తప్పుకుంది.

 

 

IND vs PAK | దాయాది పాకిస్థాన్‌పై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన టీమ్‌ఇండియా.. లంకపై కాస్త కష్టంగానే నెగ్గి ఆసియాకప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. వరుసగా మూడో రోజు మైదానంలోకి దిగిన మన బ్యాటర్లు.. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై భారీ స్కోరు చేయలేకపోయినా.. బౌలర్లు మెరుగైన ప్రదర్శనతో ప్రత్యర్థికి అడ్డుకట్ట వేశారు. బంతితో 5 వికెట్లు తీసి భారత టాపార్డర్‌ను వణికించిన నూనూగు మీసాల లంక యువ స్పిన్నర్‌ దునిత్‌.. బ్యాట్‌తోనూ భయపెట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఆసియాకప్‌ సూపర్‌-4లో వరుసగా రెండో విజయం నమోదు చేసుకున్న రోహిత్‌ సేన ఫైనల్‌కు దూసుకెళ్లగా.. బంగ్లాదేశ్‌ రేసు నుంచి తప్పుకుంది!

కొలంబో: బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై భారత్‌ విజృంభించింది. వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగిన పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుచేసిన రోహిత్‌సేన.. సూపర్‌-4లో భాగంగా రెండో మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో లంకను మట్టికరిపించింది. దీంతో 4 పాయింట్లు ఖాతాలో వేసుకున్న టీమ్‌ఇండియా ఆసియాకప్‌ ఫైనల్‌కు చేరగా.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన బంగ్లాదేశ్‌ అధికారికంగా రేసు నుంచి తప్పుకుంది. చెరో విజయం నమోదు చేసుకున్న శ్రీలంక, పాకిస్థాన్‌ మధ్య గురువారం జరుగనున్న మ్యాచ్‌ విజేతతో భారత్‌ తుదిపోరులో తలపడనుంది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (53; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) వరుసగా మూడో మ్యాచ్‌లో అర్ధశతకంతో ఆకట్టుకోగా.. గత మ్యాచ్‌ సెంచరీ హీరో కేఎల్‌ రాహుల్‌ (39) రాణించాడు. లంక బౌలర్లలో దునిత్‌ వెల్లలాగె 5, చరిత అసలెంక 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో లంక 41.3 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. దునిత్‌ (42 నాటౌట్‌, ధనంజయ డిసిల్వా (41) పోరాడినా ఫలితం లేకపోయింది. పాథుమ్‌ నిషాంక (6), దిముత్‌ కరుణరత్నె (2), కుషాల్‌ మెండిస్‌ (15), సమరవిక్రమ (17), అసలంక (22), కెప్టెన్‌ షనక (9) విఫలమయ్యారు. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ 4, జడేజా, బుమ్రా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. దునిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’అవార్డు దక్కింది. సూపర్‌-4 దశలో భాగంగా శుక్రవారం జరుగనున్న నామమాత్రమైన పోరులో బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడనుంది.

 

దునిత్‌ తడాఖా

తీవ్ర అలసట మధ్య బరిలోకి దిగిన భారత బ్యాటర్లకు ఈ మ్యాచ్‌లోనూ మెరుగైన ఆరంభం లభించింది. తొలి వికెట్‌కు 80 పరుగులు జోడించిన తర్వాత శుభ్‌మన్‌ గిల్‌ (19) ఔట్‌ కాగా.. పాకిస్థాన్‌పై అజేయ సెంచరీ నమోదు చేసిన స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ (3) ఈ మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయాడు. హాఫ్‌సెంచరీ అనంతరం రోహిత్‌ కూడా వెనుదరిగాడు. ఈ మూడు వికెట్లు దునిత్‌ ఖాతాలోకే వెళ్లడం గమనార్హం. పిచ్‌ పూర్తిగా స్పిన్నర్లకు సహకరించగా.. 20 ఏండ్ల దునిత్‌ బంతులను అర్థం చేసుకోలేక మనవాళ్లు వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయారు. మిడిలార్డర్‌లో ఇషాన్‌ కిషన్‌ (33), కేఎల్‌ రాహుల్‌ ఆదుకునే ప్రయత్నం చేయడంతో ఒక దశలో భారత్‌ 154/3తో కోలుకున్నట్లే కనిపించింది. అయితే మరోసారి బౌలింగ్‌కు వచ్చిన దునిత్‌.. రాహుల్‌తో పాటు హార్దిక్‌ పాండ్యా (5)ను ఔట్‌ చేయగా.. రవీంద్ర జడేజా (4) కూడా ఎక్కువ సేపు నిలువలేకపోయాడు. చివర్లో అక్షర్‌ పటేల్‌ (26) విలువైన పరుగులు జోడించడంతో టీమ్‌ఇండియా పోరాడే స్కోరు చేయగలిగింది.

1వన్డేల్లో అత్యంత వేగంగా (86 ఇన్నింగ్స్‌ల్లో) 5 వేల పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన జంటగా రోహిత్‌-కోహ్లీ రికార్డుల్లోకెక్కారు. విండీస్‌ దిగ్గజాలు గార్డన్‌ గ్రీనిడ్జ్‌-డెస్మాండ్‌ హేన్స్‌ 97 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్‌ అందుకున్నారు.

2 వేగంగా 10 వేల పరుగుల మైలురాయి చేరిన జాబితాలో రోహిత్‌ రెండో స్థానంలో నిలిచాడు. హిట్‌మ్యాన్‌ 241 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్‌ చేరుకోగా.. కోహ్లీ (205 ఇన్నింగ్స్‌ల్లో) టాప్‌లో ఉన్నాడు. సచిన్‌ (259 ఇన్నింగ్స్‌ల్లో) మూడో స్థానానికి చేరాడు.

6 భారత్‌ నుంచి వన్డేల్లో 10 వేల పరుగులు పూర్తి చేసిన ఆరో బ్యాటర్‌గా రోహిత్‌ నిలిచాడు. సచిన్‌ (18,426), కోహ్లీ(13026), గంగూలీ (11,363), ద్రవిడ్‌ (10,889), ధోనీ (10773)
ముందున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘనత సాధించిన 15వ ప్లేయర్‌గా హిట్‌మ్యాన్‌ చరిత్రకెక్కాడు.

10,000 ఈ మ్యాచ్‌ ద్వారా రోహిత్‌ శర్మ వన్డేల్లో పది వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.

సంక్షిప్త స్కోర్లు
భారత్‌: 49.1 ఓవర్లలో 213 (రోహిత్‌ 53, రాహుల్‌ 39; దునిత్‌ 5/40, అసలంక 4/18), శ్రీలంక: 41.3 ఓవర్లలో 172 (దునిత్‌ 42 నాటౌట్‌, ధనంజయ 41; కుల్దీప్‌ 4/43, బుమ్రా 2/30).

Website | + posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here