కొలంబో: ఆసియాకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఆటను 45 ఓవర్లకు కుదించారు. ఇక పాకిస్థాన్ జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. వెన్ను నొప్పితో ఇమామ్ ఉల్ హక్, జ్వరంతో సౌద్ షకీల్ దూరమయ్యారు.

 

భుజ గాయంతో నసీమ్ షా ఈ టోర్నీ మొత్తానికి దూరం కాగా.. హ్యారీస్ రౌఫ్ ఈ మ్యాచ్‌ కూడా ఆడటం లేదు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న అఘా సల్మాన్‌పై వేటు వేసారు. జట్టులో అబ్దుల్లా షఫీఖ్‌తో పాటు మహమ్మద్ హ్యారీస్, జమాన్ ఖాన్, మహమ్మద్ వసీమ్ జట్టులోకి వచ్చారు.

టాస్ గెలిచిన బాబర్ ఆజామ్.. భారీ లక్ష్యాన్ని నమోదు చేయాలనే ఉద్దేశంతో బ్యాటింగ్ తీసుకున్నానని తెలిపాడు. భారీ లక్ష్యం నమోదు చేస్తే సెకండ్ ఇన్నింగ్స్‌లో ఒత్తిడి ఉంటుందన్నాడు. పిచ్ భిన్నంగా ఉందని తెలిపాడు.

మరోవైపు శ్రీలంక కెప్టెన్ డసన్ షనక మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకుందామనుకున్నామని చెప్పాడు. పిచ్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటుందని తెలిపాడు. జట్టులో రెండు మార్పులు చేశానని చెప్పిన డసన్ షనక.. ప్రమోధ్ మదుషన్, కుశాల్ జనిత్ జట్టులోకి వచ్చారని చెప్పాడు.

ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టే ఆదివారం టీమిండియాతో జరిగే ఫైనల్లో తలపడనుంది.

 

తుది జట్లు:

పాకిస్థాన్: ఫకార్ జమాన్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజామ్(కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్(కీపర్), మహమ్మద్ హ్యారీస్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, షాహిన్ అఫ్రిది, మహమ్మద్ వసీమ్ జూనియర్, జమాన్ ఖాన్

శ్రీలంక: పాతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(కీపర్), సదీర సమరవిక్రమా, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, డసన్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, మహీష్ తీక్షణ, ప్రమోద్ మధుషాన్, మతీష పతీరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *