గిల్ పుట్టినరోజు సందర్భంగా అతడి అభిమానులు మంచి మనసు చాటుకున్నారు. నిరుపేదలకు భోజనం పెట్టి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఎన్జీవో ఆధ్వర్యంలో అనాధ పిల్లలకు కేక్ తినిపించడంతో పాటు వారికి ఆహార పొట్లాలను అందజేశారు.

టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈరోజు 24వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఆసియా కప్ కోసం శ్రీలంకలో ఉన్న గిల్ అక్కడే తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నాడు. కొలంబో వేదికగా టీమిండియా సహచరుల సమక్షంలో అతడు కేక్ కట్ చేశాడు. ఈ మేరకు గిల్ బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియోను టీమిండియా స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ముఖం నిండా కేక్‌తో ఉన్న గిల్ ఫొటోను కూడా అతడు షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు శుభ్‌మన్ గిల్‌కు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. భవిష్యత్‌లో అతడు మరెన్నో రికార్డులు బద్దలు కొట్టాలని ఆకాంక్షిస్తున్నారు.

మరోవైపు గిల్ పుట్టినరోజు సందర్భంగా ఇండియాలో అతడి అభిమానులు మంచి మనసు చాటుకున్నారు. నిరుపేదలకు భోజనం పెట్టి బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఎన్జీవో ఆధ్వర్యంలో అనాధ పిల్లలకు కేక్ తినిపించడంతో పాటు వారికి ఆహార పొట్లాలను అందజేశారు. ఈజీ ఫౌండేషన్ అనే నాన్ ప్రాఫిట్ గ్రూప్ భారతదేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇచ్చే విరాళాలను పోగుచేసి పిల్లలకు ఆహారం అందిస్తోంది. దీంతో శుభ్‌మన్ గిల్ 24 అంటూ అతడి అభిమాన సంఘాలు ఈజీ ఫౌండేషన్ ఎన్జీవోకు డబ్బు విరాళంగా ఇచ్చి పిల్లలకు ఆహారం ఇవ్వమని కోరారు. కాగా ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో విఫలమైన శుభ్‌మన్ గిల్ నేపాల్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ నేపథ్యంలో సూపర్-4లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగే పోరులో రాణించాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *