A9 న్యూస్:
దేశం గర్వించదగ్గ చంద్రయాన్-3 బుధవారం చంద్రుడిపై అడుగుపెట్టనుంది. ఇలాంటి అపూర్వ ఘట్టాన్ని లైవ్ చూసేలా విద్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డీఈవోలు, ప్రిన్సిపల్స్క తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
సాయంత్రం 5.20 గంటల నిమిషానికి టీ సెట్, నిపుణ ఛానెళ్లలో లైవ్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 6.00 గంటలకు ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. సాధారణంగా స్కూళ్లు 4.45కు ముగుస్తాయి. కానీ లైవ్ కారణంగా రేపు ఆలస్యంగా ముగియనున్నాయి.