ఢిల్లీ A9 news:
*చంద్రాయన్- 3 జాబిల్లికి అత్యంత దగ్గరిగా విక్రమ్.. కాలుమోపడానికి ఇక సూర్యోదయమే ఆలస్యం
*చంద్రయాన్-3 ప్రయోగం కీలక దశకు చేరుకుంది. చంద్రుడికి అత్యంత దిగువన ల్యాండర్ మాడ్యూల్ కక్ష్యను ఇస్రో శాస్త్రవేత్తలు తగ్గించారు. ఫైనల్ డీబూస్టింగ్ ఆపరేషన్ చేపట్టి విజయవంతంగా ల్యాండర్‌ను దిగువ కక్ష్యకు చేర్చారు. చంద్రుడిపై కాలుమోపడమే మిగిలి ఉంది.
*ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్-3లో కీలక ఘట్టం పూర్తయింది. రెండో, చివరి డీ-బూస్టింగ్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్లు శనివారం అర్ధరాత్రి దాటాక ఇస్రో ప్రకటించింది. దీంతో చంద్రుడి అతిదగ్గరి కక్ష్యలోకి విక్రమ్ మాడ్యూల్ చేరింది. చంద్రుడి నుంచి విక్రమ్ ల్యాండర్ ప్రస్తుతం అత్యల్పంగా 25కి.మీ, అత్యధికంగా 134 కి.మీలో దూరంలో ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ కీలక ఘట్టం పూర్తికావడంతో ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై దిగడమే మిగిలి ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రస్తుతం కీలక, చివరిదశ అయిన విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్‌పై దృష్టి పెట్టారు. అన్ని అనుకూలిస్తే ఇస్త్రో ఆగస్టు 23న చంద్రుడి దక్షిణధ్రువంపై ఘనంగా కాలుమోపుతుంది. ‘‘ రెండో, చివరి డీబూస్టింగ్ ఆపరేషన్‌తో ల్యాండర్ మాడ్యూల్ 25 కి.మీ x 134కి.మీ కక్ష్యలోకి చేరింది. మాడ్యూల్‌ను అంతర్గతంగా తనిఖీ చేయాల్సి ఉంది. ఎంచుకున్న ల్యాండింగ్ సైట్‌లో సూర్యోదయం కోసం ఎదురుచూస్తున్నాం. చంద్రుడిపై అడుగుపెట్టే ప్రక్రియ ఆగస్టు 23న సాయంత్రం 5.45 నిమిషాలకు ప్రారంభమవుతుంది’’ అని ఇస్రో ఎక్స్(ట్విటర్)లో పేర్కొంది.