ఆజాధికా అమృత్ మహోత్సవంలో భాగంగా 76 సంవత్సరాలు పూర్తిచేసుకుని 77 వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దోళ్ల గంగారెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మామిడిపల్లి నందు జాతీయ పతాకాలను ఇంటింటికి వెళ్లి ఇవ్వడమైనది.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, బిజెపి సీనియర్ నాయకులు బొట్ల విజయ్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు, గిరిజన మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కిలోత్ పీర్ సింగ్, మరియు కె.గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.