సముద్రంలో దూకి ఇద్దరి ప్రాణాలు కాపాడిన పోలీస్..
ఏపి: బాపట్ల జిల్లా కొత్త పట్నం బీచ్ లో స్నానానికి దిగిన ఇద్దరు పర్యాటకులు అలల ధాటికి కొట్టుకు పోతుండగా ఓ మెరైన్ పోలీస్ సాహసం చేశారు.
తన ప్రాణాలను లెక్క చేయకుండా సముద్రంలో ఈదుకుంటూ వెళ్లి వారిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. వారికి ప్రాథమిక చికిత్స అందించి, బంధువులకు అప్పగించారు.
ఆ పర్యాటకులు కర్నూలు కు చెందిన వారిగా గుర్తించారు. కాగా, సాహసం చేసిన పోలీసును డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అభినందించారు.