Monday, November 25, 2024

కండ్ల కలక రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

spot_img
- Advertisement -spot_imgspot_img
- Advertisement -spot_imgspot_img

A9 news

కండ్ల కలక ఎలా వస్తుంది?

ఇది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఒకవేళ వస్తే ఏం చేయాలి?

కండ్ల కలక (పింక్‌-ఐ) కలకలం సృష్టిస్తోంది. వర్షాలు కురవడం, వాతావరణంలో మార్పులు సంభవించడంతో వస్తున్నది. ఇదీ ప్రధానంగా వైరస్‌, బ్యాక్టీరియా,అలర్జీ కారణంగా వేగంగా వ్యాప్తి చెందుతున్నది. అడెనో వైరస్‌ కారణంగా వస్తుండగా.. స్కూళ్లు, హాస్టళ్లు, జన సమూహం ఉన్న ప్రాంతాల్లో అధికమవుతున్నది.వాతావరణంలో మార్పులు సంభవించడంతో వస్తున్నది. ఇదీ ప్రధానంగా వైరస్‌, బ్యాక్టీరియా,అలర్జీ కారణంగా వేగంగా వ్యాప్తి చెందుతున్నది. అడెనో వైరస్‌ కారణంగా వస్తుండగా.. స్కూళ్లు, హాస్టళ్లు, జన సమూహం ఉన్న ప్రాంతాల్లో అధికమవుతున్నది. వైరస్‌, బ్యాక్టిరియా ద్వారా వస్తే చూపు దెబ్బతినే ప్రమాదం ఉంది.

అలర్జీ ద్వారా వస్తే తేలికగా తగ్గిపోతుందని వైద్యులు తెలుపుతున్నారు. మందులు, ఐ డ్రాప్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిందంటున్నారు. ప్రధానంగా కంగారు పడాల్సిన పనిలేదని, వచ్చిన వారు ఐసోలేట్‌ అయితే సులభంగా కట్టడి చేయవచ్చని సూచిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వైద్యశాఖ అధికారులు అవగాహన కల్పిస్తూ.. నివారణకు చర్యలు తీసుకున్నారు.కండ్ల కలక వచ్చిన వారి కండ్లలోకి చూస్తే ఇది వ్యాప్తి చెందదు. పింక్‌-ఐ వచ్చిన వారు ఉపయోగించిన వస్తువులను మనం ఉపయోగించినా, వారు తాకిన వాటిని మనం తాకినా.. వారితో కరచాలనం చేసినా.. చేతులు శుభ్రం చేసుకోవాలి.

అలా చేతులు కడుక్కోకుండా అలానే మన కండ్లను తుడుచుకోవడం, తాకడం చేస్తే వస్తుంది. కాంటాక్ట్‌ లెన్స్‌ వాడే అలవాటున్న వారు వాటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం కారణంగా వస్తోంది. స్కూళ్లు, జన సమూహాల్లో ఏ ఒక్కరికి వైరస్‌ వచ్చినా మిగిలిన వారికి వేగంగా వ్యాపిస్తోంది.

ఈ లక్షణాలుంటే కండ్ల కలక వచ్చినట్లే..

ఒక కన్ను లేదా రెండు కండ్లు ఎర్రగా మారడం

 కండ్లలో మంట నొప్పి లేక దురద

 కనురెప్పలు వాపురావడం.

 కంటి రెప్పలు అతుకున్నట్లు అనిపించడం(ఉదయం నిద్రలేచే సరికి ఎక్కువ ఊసులతో కను రెప్పులు అతుక్కొని ఉండడం)

 వెలుతురును చూడలేక పోవడం. కళ్ల నుంచి నీరు, చిక్కటి ద్రవం కారడం.

బ్యాక్టీరియా కారణంగా కండ్ల కలక వస్తే కళ్లలో నుంచి చీము వచ్చే అవకాశం ఉంది. అలా వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చూపు కోల్పోవచ్చు.

కండ్ల కలకకు కారణమయ్యే వైరస్‌తో సాధారణ జలుబు వస్తుంది. చిన్న పిల్లలకు జ్వరం కూడా రావచ్చు.వచ్చిన వారికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి

కండ్ల కలక వచ్చిన వారు కండ్లు నలవడం, కంట్లో చేతులు పెట్టడం చేయొద్దు

శుభ్రమైన టిష్యూ లేక కర్చీఫ్‌ వాడి కండ్లు తుడుచుకోవాలి. వేడి నీళ్లలో వాటిని శుభ్రం చేసుకోవాలి

నల్లటి అద్దాలు ధరించాలి. తద్వారా వైరస్‌ వేరే వారికి వ్యాపించకుండా ఉంటుంది.

ఐసోలేట్‌ అయిపోవాలి. వైరస్‌ వచ్చిన వారు వేరు గదిలో ఉండడం ద్వారా ఇంట్లో మిగిలిన వారికి రాకుండా చూసుకోవచ్చు.

కండ్ల కలక వచ్చిన వారు వాడే టవల్స్‌, కర్చీఫ్‌ వేరే వారు వాడకూడదు.

పిల్లల్లో ఈ లక్షణాలు కనిపించినప్పుడు వారిని స్కూల్‌కు పంపకుండా, వ్యాప్తిని అరికట్టడానికి ప్రయత్నించాలి.

సొంత ప్రయోగాలు, ఇంటి వైద్యంతో ఆలస్యం చేయకుండా సమస్య చిన్నగా ఉన్నప్పుటే వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటే మంచిది. కండ్ల కలక వచ్చిన వారి కండ్లలోకి చూస్తే ఇది వ్యాప్తి చెందదు. పింక్‌-ఐ వచ్చిన వారు ఉపయోగించిన వస్తువులను మనం ఉపయోగించినా, వారు తాకిన వాటిని మనం తాకినా.. వారితో కరచాలనం చేసినా.. చేతులు శుభ్రం చేసుకోవాలి.

అలా చేతులు కడుక్కోకుండా అలానే మన కండ్లను తుడుచుకోవడం, తాకడం చేస్తే వస్తుంది. కాంటాక్ట్‌ లెన్స్‌ వాడే అలవాటున్న వారు వాటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం కారణంగా వస్తోంది. స్కూళ్లు, జన సమూహాల్లో ఏ ఒక్కరికి వైరస్‌ వచ్చినా మిగిలిన వారికి వేగంగా వ్యాపిస్తోంది.వర్షాకాలంలో వచ్చే కండ్ల కలకకు ప్రధాన కారణం అడినోవైరస్‌, వాతావరణ మార్పుల కారణంగా ఇది వస్తోంది.

ఒకరి నుంచి మరొకరి వ్యాపిస్తోంది, ఇప్పుడు వచ్చిన కేసుల్లో ఎక్కువ శాతం స్కూళ్లు, హాస్టళ్లలో వస్తున్నవే ఉన్నాయి. వచ్చిన వెంటనే వేరుగా ఉండడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, శుభ్రం చేసిన టవల్స్‌, కర్చీప్‌ వాడాలి. అద్దాలు పెట్టుకోవడం మంచిది. లేని పక్షంలో యాంటిబయోటిక్‌ వాడాలి.

కండ్ల కలకకు సంబంధించి పీహెచ్‌సీల వైద్యులు రోజు హాస్టల్స్‌ విజిట్‌ చేయాలని ఆదేశించాం. వారికి కావల్సిన మెడిసిన్‌ కూడా అందుబాటులో ఉంచాం. కావల్సినన్ని ఐ డ్రాప్స్‌ అందుబాటులో ఉంది.

అపోహలు నమ్మొద్దు రాకుండా కట్టడి చేయడం అన్నిటికంటే ఉత్తమం.*

+ posts
- Advertisement -spot_imgspot_img
Latest news
spot_img
- Advertisement -spot_img
Related news
- Advertisement -spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here