నిజామాబాదు A9 news
నందిపేట్ మండలం తొండకూరు గ్రామాల మధ్య గల ఆర్ అండ్ బి రోడ్డు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రోడ్డు తెగిపోయి భారీ గుంత ఏర్పడింది రెండు గ్రామాల మధ్య రాకపోకలు సుమారు 20రోజుల నుండి నిలిచిపోయాయి. రెండు గ్రామలే కాకుండా డొంకేశ్వర్ మండలం లోని సుమారు 10 గ్రామాల ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారు. ఇది తెలియని చాలా మంది అక్కడి వరకు వెళ్లి తిరిగి వెళ్ళుతున్నారు. ఆ గుంత వద్ద ఒక్క శవం పైకి తెలి ఉండటం చుట్టూ పక్కల పొలాల వాళ్ళు గమనించారు ఇది అందరూ నోటా రెండు గ్రామాలలో తెలిసింది పోలీస్ వారికీ తెలియజేశారు.
ఆ శవాన్ని తీసి చూడగా అది నందిపేట్ మండల కేంద్రనికి చెందిన ఆదిమూల సాయికిరణ్ అని గుర్తించారు. అతని వయస్సు 21సంవత్సరాలు అతను వృత్తి డిష్ టీవీ ఆంటీనాలు బిగించడం, సర్వీస్ చెయ్యడం,అతను 3రోజుల నుండి ఫోన్ కలవక పోవటం వలకు అతని ఆచూకీ తెలియలేదు అతను సుమారు 3రోజుల క్రితం రాత్రి పూట అక్కడ రోడ్డు తెగిన విషయం తెలియక వెళ్లి గుంత లొ పడి చనిపోవచ్చని ప్రజలు అనుకుంటున్నారు. అతను ప్లాటినా బైక్ పై వెళ్లాడని కుటుంబసభ్యులు అంటున్నారు, అతని బైక్ అ నీటిలో ఉంటుందేమోనని అంటున్నారు.
పోలీస్ వారు రేపు ప్లాటినా బైక్ కోసం గలింపు చర్యలు చేపట్టుతామని తెలిపారు, శవాన్ని పోస్టుమార్టంకి తరలించారు.ఇది చాలా విషాదకరమైన సంఘటన గా నందిపేట్ మండలంలో నిలిచిపోయింది. ఆ రోడ్డు కాంట్రాక్టర్ అక్కడ బ్రిడ్జి కట్టాలి కానీ రోడ్డు వేసి బ్రిడ్జి సంగతి పట్టించు కోలేదు ఇటీవలే అక్కడికి తెగిపోయిన రోడ్డును చూడటానికి వచ్చిన ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే జీవన రెడ్డి కాంట్రాక్టర్ కు ఫోన్ చేసి చెప్పిన కూడా ఆ కాంట్రక్టర్ రోడ్డును బాగుచేయక పోవటం వల్ల ఒక్క యువకుడు నిండు ప్రాణం బాలీ అయ్యిందని ప్రజలు అంటున్నారు.