నిజామాబాద్ A9 news

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సూచనల మేరకు నందిపేట్ మండల మల్లారం గ్రామంలో బూత్ కమిటీ సమావేశాన్ని ఏర్పరిచి, 400 ఓట్లకు ఏడుగురు ఇన్చార్జిలను నియమించడం జరిగింది. అదేవిధంగా భూత్ ఇన్చార్జిగా గ్రామ సర్పంచ్ అర్జున్ ని నియమించడం జరిగింది.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి జీవన్ రెడ్డిని 60 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించడానికి కృషి చేయాలని నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్, మాజీ ఎంపీపీ రవి తెలపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇంతియాజ్, వార్డ్ మెంబర్లు సాయిలు, ఎర్రన్న, హైమద్, దేవన్న, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *