ప్రశాంత్ రెడ్డి కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నాడు ప్రభుత్వం ఆయనకు ప్రోటోకాల్ ఇచ్చి మర్యాదిస్తే అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడు ప్రశాంత్ రెడ్డి తీరు మార్చుకోవాలి.
– బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్
సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం
1)తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అవుతుందని అలాగే బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గెలిచి కూడా సంవత్సరం అవుతుందని ఈ సంవత్సర కాలంలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచాను అన్న విషయం మర్చిపోయి ప్రభుత్వం ఆయనకు ప్రోటోకాల్ మర్యాదలు ఇచ్చినా ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనకుండా ప్రభుత్వ ఇచ్చే పథకాలను లబ్ధిదారులకు అందకుండా ఉద్దేశపూర్వకంగా ప్రవర్తిస్తున్నాడని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ అన్నారు.
2)గతంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న వారి పార్టీ కనీసం రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వకుండా ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయించిందని ఇప్పుడు ఈ ప్రజా ప్రభుత్వం ఆర్థికంగా ఎంత కష్టమైనప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని అన్నారు.
3) ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే రెండు పథకాలు అమలు చేసిందని 10 సంవత్సరాలుగా పెండింగ్ లొ ఉన్న రేషన్ కార్డు ల సమస్యను తీరుస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు,భూమిలేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా సంవత్సరానికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించే పథకాలను జనవరి 26 నుండి అమలు చేయబోతుందని అన్నారు, రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతుకు పెట్టుబడి సహాయం అందిస్తుందని తెలిపారు.
4) నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కలిపి 246 కల్యాణ లక్ష్మి చెక్కులు మంజూరయి దాదాపు మూడు నెలలు గడుస్తుందని మరో వారం రోజుల్లో చెక్కుల గడువు తీరిపోతుందని అధికారులు ఎంత విన్నవించినా ప్రశాంత్ రెడ్డి చెక్కులు పంచడానికి రాకుండా ప్రోటోకాల్ ని అగౌరవపరుస్తున్నారని తెలిపారు.
4) గతంలో వారి ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు రావాలంటే సంవత్సరాల తరబడి ఎదురు చూసేవారని ఎప్పుడు ఈ ప్రజా ప్రభుత్వంలో మూడు నెలలకే చెక్కులు మంజూరు చేసిన ప్రశాంత్ రెడ్డి నిర్వాకం వల్ల లబ్ధిదారులకు అందకుండా పోతుందని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వం తనకిస్తున్న ప్రోటోకాల్ ను అడ్డుపెట్టుకొని ఆపుతున్నారని ఇది దుర్మార్గమైన వ్యవహారమని అన్నారు.
5) గతంలో ఉద్యోగులు జీతాల కోసం వేచి చూసే వారిని, పేద ప్రజలు పింఛన్లు సక్రమంగా అందక ఇబ్బంది పడే వారిని ఇప్పుడు ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు పడుతున్నాయని పింఛన్లు సక్రమంగా అందుతున్నాయని తెలిపారు
6) గత ప్రభుత్వంలో పెండింగ్ లొ పెట్టిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు ఈ ప్రజా ప్రభుత్వం విడుదల చేస్తే ప్రజలకు త్వరితగతిని ఇవ్వకుండా ఆపుతూ ఇబ్బంది పెడుతున్నారని ప్రజలందరికీ వెంటనే చెక్కులు పంపిణీ చేయాలని ఆయన హెచ్చరించారు.
6) నాలుగు పథకాలకు సంబంధించి ప్రజా పాలన గ్రామసభలు జరుగుతుంటే కొందరు తొత్తులని ఆ సభలకు పంపించి అధికారుల మీద దాడి చేయాలంటూ పూరిగొల్పుతున్నారని ఈ పద్ధతి మంచిది కాదని ఆయన పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు.
7) ప్రశాంత్ రెడ్డికి ప్రోటోకాల్ ఉందని గ్రామ గ్రామాన జరుగుతున్న గ్రామ సభలలో పాల్గొని ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించాలి కానీ ప్రభుత్వం అమలు చేసే పథకాల పట్ల తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం మంచిది కాదని హితవు పలికారు.
8) ఇప్పటివరకు ఆయన ప్రోటోకాల్ కు తను ఎటువంటి భంగం కలిగించలేదని ప్రభుత్వం ఇచ్చే మర్యాదని ప్రశాంత్ రెడ్డి పోగొట్టుకుంటున్నాడని తెలిపారు.
ప్రశాంత్ రెడ్డి ఇదే ప్రవర్తనను కొనసాగిస్తే గ్రామాల్లో తిరుగలేడని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి మండల అధ్యక్షుడు సంకేట రవి, మోర్తాడ్ మండల పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, వేల్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి, ఎర్గట్ల మండల పార్టీ అధ్యక్షుడు దేవారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రంగు అనిల్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, జక్క రాజేశ్వర్, అన్ని మండలాల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు,నాయకులు పాల్గొన్నారు