కరీంనగర్ జిల్లా: జనవరి 23

కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులను కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ నెల 24న ప్రారంభించను న్నారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన సభా వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

 

కరీంనగర్‌ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన 24/7 మంచినీటి సరఫరా, మల్టీపర్పస్‌ పార్కు, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్టేడియం స్పోర్ట్స్‌ కాంప్లెక్సు, ఈ-క్లాస్‌రూమ్స్‌ను వారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌, మేయర్‌ యాదగిరి సునీల్‌రావుతో కలిసి ప్రారంభించనున్నారు.

 

అనంతరం హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసే సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఇందుకోసం నగరపాలక సంస్థ ఆధ్వ ర్యంలో ఏర్పాట్లు చేస్తు న్నారు. బుధవారం ఎంపీ, కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌, మేయర్‌యాదగిరి సునీల్‌రావు, కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ కరీం నగర్‌లో పర్యటించారు.

 

ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్‌కుమార్‌ ప్రభుత్వ పాఠశాల విద్యా ర్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. అనంతరం హౌసింగ్‌బోర్డు కాలనీలోని గ్రౌండ్‌లో సభా స్థలాన్ని పరిశీలించి, మున్సిపల్‌ ఇంజనీరింగ్‌, పోలీసు అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *