*ఇంద్రమ్మ ఇండ్లు మొత్తం రెడ్డిలకే ఇంత ఘోరం ఎక్కడ చూడలేదు ప్రజల ఆవేదన*
మాసాయిపేట తూప్రాన్ జనవరి 23
మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోన మాసాయిపేట మండల కేంద్రంలోని గ్రామ చావడి దగ్గర ప్రజా పాలన కార్యక్రమం భాగంగా గ్రామసభలో అధికారులను ఎడాపెడా మాటలతో నిలదీశారు ప్రజాప్రతినిధులు ప్రజలకు సమాధానం ఇవ్వలేకపోయారు విగ్రహం లాగా నిల్చోని చూస్తూ ఉండిపోయారు అదేవిధంగా గ్రామ కార్యదర్శి మా కేలాంటి స్పందన ఇవ్వడం లేదు ఆమెను వెంటనే తీసేయాలని గ్రామసభలో ప్రజలు బిగ్గరగా కేకలు వేశారు వెంటనే గ్రామ కార్యదర్శులు తీసేయాలని ఎలాంటి పనులు చేపట్టడం లేదని రెడ్డిల వైపు మొగ్గు చూపుతోందని గ్రామసభలో కేకలతో బిగ్గరగా అర్చారు గ్రామపంచాయతీ సెక్రెటరీ వద్దు వద్దు అని రైతులు ప్రజలు యువకులు నిరుద్యోగులు తెలిపారు గ్రామ సభలో పాల్గొన్న అధికారులు తాసిల్దార్ జ్ఞాన జ్యోతి రెవెన్యూ ఇన్స్పెక్టర్ దన్ సింగ్ నాయక్ గ్రామపంచాయతీ కార్యదర్శి కారోబార్ వివిధ శాఖల అధికారులు మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు